
శృతి హాసన్.. ఈమె టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లలోనే కాదు.. ఇండియా మొత్తం ఫేమస్ అనే చెప్పాలి. అందాలు ఆరబోయడంలో ఎలాంటి మొహమాటం అనేది పెట్టుకోదు.. శృతి హాసన్ కెరీర్ మరోసారి ఊపందుకుంది.. గత ఏడాది వరకు ఒక్క సినిమాను కూడా ఒప్పుకోని ఈ భామ ఈ మధ్య మళ్ళీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్ లో జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది..
క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను మంచి జోష్ లో స్టార్ట్ చేయగా ఇప్పుడు కెరీర్ ఫామ్ లోకి వచ్చింది. ఈ ఏడాది అప్పుడే తన ఖాతాలో రెండు హిట్స్ వేసుకుంది.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ అందుకున్న ఈ భామ మరిన్ని అవకాశాలను అందుకుంది.
ఇదిలా ఉండగా ఈ భామ సినిమాలతో కెరీర్ ఎలా ఉన్న సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ముక్కుసూటిగా ఎప్పుడు వ్యవహరించే ఈ భామ తాజాగా మరోసారి చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఈ భామ తన బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు షేర్ చేసుకుంటూనే ఉంటుంది..
ప్రజెంట్ ఈ అమ్మడు శాంతను హజారికాతో డేటింగ్ లో ఉంది.. మా మధ్య సినిమా, మ్యూజిక్, కళలు కామన్ కాబట్టి మేము కనెక్ట్ అయ్యాం.. శాంతను లాంటి వారు చాలా రేర్ గా ఉంటారు.. నేను గతంలో చాలా మంది యాక్టర్లతో డేటింగ్ చేశాను కానీ వాళ్లతో వర్కౌట్ కాలేదు.. కానీ శాంతనుతో నాకు చాలా బాగా సెట్ అయ్యింది.. మా బంధంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
ReplyForward
|