Chiranjeevi : అజిత్ కుమార్, శృతిహాసన్ జంటగా నటించిన తమిళ చిత్రం
‘వేదాళం’ ను రీమేక్ గా తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ గతంలో చేసిన సినిమా ‘చూడాలని ఉంది’ లో అందరినీ అలరించిన ‘రామ్మా చిలకమ్మా’ అనే పాటను ‘భోళా శంకర్’ లో రీమిక్స్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. ఇది జరిగితే సూపర్ రెస్పాన్స్ వస్తుందని అంచనా.
అయితే ‘రామ్మా చిలకమ్మా’ రీమిక్స్ కోసం సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేశారని అప్పట్లో వార్తలు చాలానే వచ్చాయి. దర్శకుడు మెహెర్ రమేష్ మాత్రం దీనిని పూర్తిగా ఖండించాడు. ‘భోళా శంకర్’ పాటల కోసం మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ మంచి సంగీతాన్ని అందించాడని చెప్పాడు. ఇక రీమిక్స్ చేద్దామని తాము ఆలోచించలేదని చిత్ర యూనిట్ వివరించింది.
గతంలో వచ్చిన ‘చూడాలని ఉంది’ మూవీలోని ‘రామ్మా చిలకమ్మా’ పాటను పాడిన మణిశర్మ స్వయానా మహతి సాగర్ కు తండ్రి. దీంతో చిరు తప్పనిసరిగా రీమిక్ప్ కు చేస్తాడని అందరూ భావిస్తున్నారు.
ఇక ‘భోళా శంకర్’ లో చిరుతో పాటు కొంత మంది నటీనటులు ‘రామ్మా చిలకమ్మా’ పాటపై సరదాగా డ్యాన్స్ వేసే సన్నివేశం ఉంటుందని కొంత సమాచారం.అయితే కొంత మంది మాత్రం మెగాస్టార్ తన పాటను తాను రీమిక్ప్ చేసేందుకు సుముఖుతను చూపట్లేదని వివరిస్తున్నారు. రీమిక్స్ పై కొనసాగే ఉత్కంఠకు ఆగస్ట్ 11 తేదీన తెరపడుతుందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆ పాట రీమిక్స్ ఖచ్చితంగా ఉంటుందని చిరు ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.