37 C
India
Friday, May 17, 2024
More

    Skill Development Scam : స్కిల్ స్కాం కేసు కుట్రపూరితం..బయటకు వస్తున్న నిజాలు

    Date:

    Skill Development Scam
    Skill Development Scam

    Skill Development Scam : ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుట్రపూరితమేననే టీడీపీ శ్రేణుల ఆరోపణలు నిజమవుతున్నట్లుగా కనిపిస్తున్నది. అసలు లేని స్కాంపై ఎలాంటి ఆధారాలు లేకుండానే ఏకంగా మాజీ సీఎంపై అభియోగాలు మోపడం వెనుక, మొత్తం ఏపీ ప్రభుత్వమే పని చేసిందనే ఆరోపణలు  గత వారం రోజులుగా వినిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన ఏపీ సీఐడీ, ఏఏజీ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతుంటే, ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా ముందుకెళ్తున్నదో చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నది. ఏకంగా ఏపీ సీఐడీ అధికారి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు అందరిలో అనుమానాలకు తావిస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ లో చే సుకున్న ఒప్పందాలపై టీడీపీ ఒక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, అందులో అన్ని నిజాలను పొందుపర్చింది.

    స్కిల్ స్కాం అంటూ రెండున్నరేళ్ల క్రితం కేసు పెట్టారు. అంతా తిరిగారు. కానీ ఎక్కడా ఆధారాలు మాత్రం దొరకలేదు. ఆధారాలు ఉన్నాయంటారు. కానీ అందులో అంతా డొల్లతనమే. ఏ ఒక్కటీ బయటకు ఆధారాలు ఇవ్వరు. కేబినెట్ నోట్ ఉన్నా కేబినెట్ అనుమతి లేదంటారు. సెంటర్లలో అన్ని వసతులు ఉన్నా లేవంటారు. అసలు సిమెన్స్ తో ఒప్పందమే లేదని ఆ పార్టీ క్రియాశీలక నేత సజ్జల ప్రెస్ మీట్లలో ఉదరగొడుతుంటారు.  ఇప్పుడు  టీడీపీ ఆధారాలు చూపితే మీడియాకు మోహం చాటేస్తారు. అసలు వారి పక్కనే అధికారులను మాత్రం ఈ కేసు విషయంలో పట్టించుకోరు. ప్రేమ్ చంద్రారెడ్డి, అజయ్ కల్లం విషయంలో చర్యలేవి అంటే చెప్పరు. నాడు సంతకాలు చేసిన ప్రేమ్ చంద్రారెడ్డిని మాత్రం ప్రశ్నించరు.

    ఏదేమైనా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్ర లేకున్నా, ఏదో కథ నడిపించి ఆయన కు నష్టం కలిగించాలని అభియోగాలు మోపారు.  అడ్డగోలుగా వాదించారు. ఇంకేం ఇప్పుడు టీడీపీ అసలు ఆధారాలు చూపడంతో నోరు మూశారు. ఇలాంటి వ్యవస్థలు మనల్ని పాలిస్తున్నాయని తెలుసుకున్న ప్రజలు మాత్రం ఇంకా అయోమయంలో ఉన్నారు.

    ఇలాంటి వ్యవస్థలతో మాజీ ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుందని అనుమానించడం తప్పా, ఇంకేం చేయగలరు. ఏపీ ప్రభుత్వ కక్షపూరిత ధోరణి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, అటు ఏఏజీ జబ్బలు చరుచుకుంటున్న ధోరణి చూసి మరికొందరు నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఏపీలో రాజకీయాలు దేశంలో మరే రాష్ర్టంలో చూడలేమంటూ చెబుతున్నారు. రాజధాని ఏంటో తెలియదు. ఉద్యోగ, ఉపాధి లేదు. ప్రతిపక్షాలు ఉండొద్దు.. ప్రశ్నించే వాడు ఉండొద్దు అన్నట్లుగా ఏపీలో పాలన కొనసాగుతున్నదని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటీషన్ పై విచారణ..

    Chandrababu Bail : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ పై...

    Vangalapudi Anitha : గుడివాడ గుడ్డు పగులుతుంది.. వంగల సీరియస్ వార్నింగ్

    Vangalapudi Anitha : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకు మరింత...

    IG Promotion List : ఐజీ ప్రమోషన్ల లిస్టులో తొలిపేరు ఆయనదే.. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకేనా?

    IG Promotion List : ‘‘వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర కూర్చున్నా...’’...