29 C
India
Wednesday, May 15, 2024
More

    Sourav Ganguly : విరాట్ పై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..?

    Date:

    Sourav Ganguly
    Sourav Ganguly

    Sourav Ganguly : వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ లో అస్ర్టేలియాపై టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రోహిత్ తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ పెట్టారు. అసలు రోహిత్ కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించడమే తప్పుడు నిర్ణయమంటూ మరికొందరు ట్వీట్లు పెట్టారు.

    ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడమే రోహిత్ చేసిన అతిపెద్ద తప్పని పలువురు అభిప్రాయ పడ్డారు. సీనియర్ అశ్విన్ ను కూడా ఈ మ్యాచ్ లో ఆడించకుండా మరో తప్పు చేశాడని, ఇలాంటి చెత్త నిర్ణయాల వల్లే టీమిండియా ఓటమి పాలైందని చెప్పుకొచ్చారు. రోహిత్ ను ఫ్యాన్స్ తో పాటు మాజీలు కూడా తిట్టిపోశారు.  ఫీల్డ్ సెట్టింగ్, బౌలర్లను వినయోగించుకున్న తీరు కూడా విమర్శలపాలైంది. అయితే కోహ్లీని మరోసారి తెరపైకి తెస్తున్నారు. టెస్ట్ కెప్టెన్ గా  విరాట్ కోహ్లికి మళ్లీ అవకాశమివ్వాలని కోరుతున్నారు.

    అయితే ఫ్యాన్స్ డిమాండ్ పై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. 2022లో టెస్ట్ కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పాడు. ఈ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్నారు. అయితే గంగూలీ, బోర్డుతో విభేదాల కారణంగానే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే గంగూలీ తాజాగా మాట్లాడుతూ కోహ్లీ కెప్టెన్సీ ఎందుకు వదులుకున్నాడో తమకు కూడా తెలియదని, తామెవరం కూడా ఊహించలేదని చెప్పుకొచ్చాడు.

    ఈ నిర్ణయంతో  అప్పటి బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. కోహ్లీ నిర్ణయం విన్నాక మేం కూడా షాక్ అయ్యాం. ఇక అప్పుడు తరువాత చాన్స్ కింద రోహిత్ కు అవకాశం ఇచ్చాం అని తెలిపాడు. కోహ్లీ ఇలా కెప్టెన్సీకి గుడ్ బై చెబుతాడని అనుకోలేదు.. అప్పటికి బీసీసీఐ ప్రిపేర్ అయిలేదు. మాకది ఊహించని పరిణామం. అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కోహ్లీ మాత్రమే చెప్పగలడు. అని స్పష్టం చేశారు. అయితే ఇప్పడు అదంతా గతమని, దాని గురించి ఇప్పుడు అవసరం లేదని తెలిపాడు. అయితే కోహ్లీ రాజీనామా చేశాకే.. రోహిత్ కు బాధ్యతలు  అప్పగించామని మాత్రం తెలిపాడు.

    దీనిపై కూడా ప్రస్తుతం ట్రోల్స్ నడుస్తున్నాయి. గతంలో కోహ్లీ వెనుకడుగు వెనుక గంగూలీ చేసిన రాజకీయాలే కారణమని అంతా భావిస్తున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా నే కోహ్లీ కెప్టెన్సీ నుంచి వెనక్కి తగ్గారని, ఇప్పుడు నీతులు చెబితే వినేవారు ఎవరూ లేరని అంతా కామెంట్లు పెడుతున్నారు. మరి కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలకు కారణమేంటనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RCB : ఆర్సీబీ ఫ్లే ఆప్స్ కు వెళ్లే అవకాశముందా?

    RCB : ఆర్సీబీ అంటేనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీం....

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ ఓపెనర్లు వీరే..

    T20 World Cup Openers : ఐసీసీ టీ20 ప్రపంచ కప్...

    Dark Day in Cricket History : క్రికెట్ చరిత్రలో చీకటి రోజు.. !

    ఆ ఘటనను తల్చుకుంటే క్రికెటర్లు ఇప్పటికీ వణికిపోతారు.. Dark Day in...

    White Ball Specialist : వైట్ బాల్ స్పెషలిస్ట్ గా బూమ్రా.. కానీ, ఆ రోజు అలా.. : రవిశాస్త్రి

    White Ball Specialist : ఇంటర్నేషనల్ క్రికెట్ కైన్సిల్ (ఐసీసీ) ఇటీవల...