White Ball Specialist : ఇంటర్నేషనల్ క్రికెట్ కైన్సిల్ (ఐసీసీ) ఇటీవల ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో భారత పేసర్ జప్‌ప్రీత్ బూమ్రా అగ్రస్థానం సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్‌గానూ రికార్డు నమోదు చేసుకున్నాడు. 2018 టెస్టుల్లోకి అడుగు పెట్టిన బుమ్రా 34 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు మొత్తం 155 వికెట్లు తీశాడు. భారత ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగుతున్న సమయంలోనే బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి వచ్చాడు. దీనికి ముందు వరకూ బుమ్రాపై ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్ అనే ముద్ర వేశారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రవిశాస్త్రి వెల్లడించాడు.
రవిశాస్త్రి మాట్లాడుతూ ‘తొలిసారి బుమ్రాతో మాట్లాడిన రోజు ఇప్పటికీ గుర్తే. అది కోల్‌కతాలో టెస్ట్ క్రికెట్ ఆడే ఆసక్తి ఉందా..? లేదా..? అని అడిగా. ‘అలాంటి అవకాశమే వస్తే నా కెరీర్ లో అతి పెద్దరోజుగా మిగిలుతుంది.’ అని బుమ్రా అన్నాడు. అప్పటి వరకు అతడిని కేవలం ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్‌గానే అందరూ చూశారు. అతడికి అలా గుర్తించడం ఇష్టం లేకపోయినా ముద్ర వేసేశారు.’
‘కానీ, బుమ్రాలో వికెట్లు తీయాలనే కసి, తపన, ఆకలి ఉందని నాకు తెలుసు. దీంతో టెస్టులు ఆడేందుకు సిద్ధం కావాలని అతడికి చెప్పా. సౌతాఫ్రికా టూర్ తీసుకెళ్తానన్నా. బుమ్రా ఆ సమయంలో టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. విరాట్‌తో కలిసి టెస్టులు ఆడాలనేది అతడి కోరికంట. చాలా మంది క్రికెటర్లు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో అద్భుతాలు చేసిన వారు ఉన్నారు. ఎవరికీ ఆ గణాంకాలు గుర్తుండవు. కానీ, టెస్టుల్లో ఎలా ఆడారనేదే మాత్రం అభిమానులు చూస్తారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అంత విలువ ఉంది మరి’ అని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.
ఆ సమయంలో సానబెట్టని వజ్రంలా కోహ్లీ..
భారత జట్టు డైరెక్టర్‌గా 2014లో రవిశాస్త్రి కొనసాగాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. విరాట్ కొహ్లీ కెప్టెన్సీలో విదేశీ గడ్డపై టీమిండియా అద్భుత విజయాలు సాధించడంలో రవిశాస్త్రి కీలకంగా వ్యవహరించారు. విరాట్ గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతున్న సమయంలో నా దృష్టి విరాట్ పై పడింది.
నేను బాధ్యతలు తీసుకున్న 2 నెలల్లోనే ఈ విషయం కోహ్లికి చెప్పా. భవిష్యత్ లో కేప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. ‘ప్రతి అంశాన్నీ పరిశీలించు నిశితంగా గమనించు, సిద్ధంగా ఉండు’ అని కోహ్లీతో అన్నా. అప్పటికీ విరాట్ నాకు సానబెట్టని వజ్రంలా కనిపించాడట. సారథ్యం తీసుకున్న తర్వాత కొహ్లీ టెస్ట్ క్రికెట్‌పై పూర్తి స్థాయి దృష్టి సారించాడు. క్లిష్టమైన పిచ్‌లపైనా జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. ఆసీస్ లేదంటే.. పాకిస్థాన్ ప్రత్యర్థి ఎవరైనా దూకుడుగా వ్యవహరించాం’ అని మాజీ ప్రధాన కోచ్, క్రికెటర్ రవిశాస్త్రి వెల్లడించాడు.