33.2 C
India
Sunday, May 19, 2024
More

    TDP : టీడీపీకి విజయసూచికలు.. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

    Date:

    TDP :
    రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలని ఏపీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నది. నిత్యం ప్రజా ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది. ఏపీ అధికార పార్టీ వైసీపీపై పై చేయి సాధించేందుకు , 2024 ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నది.
    రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఒక అంచనాకు వచ్చింది. గతంతో పోలిస్తే ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం పెరిగింది. ఇదే తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తున్నది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని ధీమా పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. 2019లో టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం , మిగతా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో తమకు విజయం ఖాయమని బలంగా నమ్ముతుంది.  ఈ మేరకు పార్టీ అంతర్గతంగా ఓ సర్వే చేయించినట్లు తెలుస్తున్నది.
    ఈ సర్వేలో ప్రస్తుతం గెలుచుకున్న 23 స్థానాలతో పాటు 79 నియోజకవర్గాల్లో టీడీపీకి గెలుపు పక్కా అని తేలిందట. దీంతో మొత్తం 102 నియోజకవర్గాల్లో టీడీపీకి విజయ అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టత రావడంతో ఇప్పుడా పార్టీ పెద్దల్లో గెలుపు దీమా మరింత  కనిపిస్తోంది.
    ఇండియా టుడే తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీ 15 ఎంపీ సీట్లో గెలుపొందుతుందని స్పష్టం చేసింది. అంతకు ముందు మరో సంస్థ వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకొంటుందని ప్రకటించింది. అది ఫేక్ అని ప్రజలు కొట్టి పారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వైసీపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. సర్వేలను పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు అన్నీ తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా మారుతున్నాయి.
     జనసేన కూడా కలిస్తే విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసినా టీడీపీకి  సహకరిస్తాయని వైసీపీ నేతలే చెప్పడం గమనార్హం.  ఓట్లన్నీ మూడు పార్టీలు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.  మొన్నటి వరకు  బీజేపీ జగన్ ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రాను రాను పరిస్థితులు మారుతాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాటలతో స్పష్టమవుతున్నది.  ఈ నాలుగున్నరేళ్ళలో ఏపీ ప్రజలు జగన్‌ పాలనను గుర్తించారు. మూడు రాజధానుల నుంచి విశాఖ రాజధాని వరకు జగన్‌ ప్రభుత్వం వేస్తున్న కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎవరూ నోరెత్తలేని పరిస్థితి కావడంతో ఓపికగా ఎన్నికల కోసం నిరీక్షిస్తున్నారు. వైసీపీని సాగనంపాలని కంకణం కట్టుకున్నారు.దీంతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ పర్యటనలకు జనాదరణ విపరీతంగా ఉంటున్నది. ఈ సంకేతాలన్నీ టీడీపీ విజయసూచికగా మారుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...