- తెలుగు టైమ్స్ & టీవీ 9- బిజినెస్ ఎక్స్ అవార్డు 2023 ఫురస్కారం అందుకున్న డాక్టర్ జగదీష్

Business Excellence Award 2023: తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ జగదీష్ యలమంచిలి గారి పేరు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. సాయం కోసం ఎదరుచూసే వారికి తాను ఉన్నానని గొప్ప మనస్సు చాటే వ్యక్తులలో డాక్టర్ జగదీష్ ముందుంటారు. తన మాతృభూమిలో రక్తం కొరతతో ఎవరు చనిపోవడానికి వీలులేదనే గొప్ప ఆలోచనతో యూబ్లడ్ యాప్( UBLOOD APP)కు శ్రీకారం చుట్టారు.
యూబ్లడ్ యాప్ ద్వారా ఎంతోమందికి రక్తాన్ని సమయానికి అందించిన ఘనత ఆయనది. చిన్న మొక్కగా ప్రారంభమైన యూబ్లడ్ యాప్ నేడు లక్షలాది మందికి సాయం అందించే స్థాయికి చేరుకుంది. దీని వెనుక డాక్టర్ జగదీష్ యలమంచిలి కృషి వెలకట్టలేనిది. కరోనా సమయంలోనూ తనవంతు బాధ్యతగా సేవలందించారు.

ఐటీ సంక్షోభం వేళ చాలా కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్న ఆయన మాత్రం సాప్ట్ వేర్ ఇంజనీర్లకు ఉద్యోగ భద్రత కల్పించారు. ఉద్యోగులను సొంత కుటుంబీకులుగా భావించి మీ ఉద్యోగానికి ఏ ఢోకా లేదనే భరోసా కల్పించారు. కరోనా సమయంలో 400మంది ఉద్యోగులకు తన సొంత ఆఫీసులోనే భోజన సదుపాయం కల్పించారు. అంతేకాకుండా ఎంతోమందికి కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాయం అందించి తన గొప్ప మనస్సు చాటుకున్నారు.
యూబ్లడ్ యాప్ తో రక్తం కొరతకు చెక్..
భారత్ లో ఎంటెక్ పూర్తి చేసి అమెరికాలో ఉన్నత స్థానంలో నిలిచారు. పాతికేళ్లు అమెరికాలో ఉండి ఎంతో పేరు సంపాదించారు. అయినాప్పటికి మాతృభూమికి సేవ చేయాలని తలిచేవారు డాక్టర్ జగదీష్. ఈక్రమంలోనే ఇండియాలో రక్తం కొరతతో అనేక మంది చనిపోతున్నారని తెలుసుకున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా యూబ్లడ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా లక్షలాది మందికి రక్తాన్ని సమయానికి అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

డాక్టర్ జగదీష్ గారి సేవలను గుర్తించిన రెండు యూనివర్సిటిలు గౌరవ డాక్టరేట్లు అందించి సత్కరించాయి. ‘జై’ గారి సేవలకు రియల్ హీరో సోనీ సూద్ లాంటి వాళ్లు కూడా ఫిదా అవడమే కాకుండా UBLOOD అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా డా. జగదీష్ గారి UBLOOD యాప్ సేవలు తెలుసుకొని ప్రతేకంగా పిలిపించుకొని అభినందించారు.
ఇండియాకు తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ లాంటి దిగ్గజాలు సైతం Ublood app సేవలకు ఫిదా అయ్యారు. అదేవిధంగా మహారాష్ట్ర సర్కార్.. తెలంగాణ ప్రభుత్వం జగదీష్ సేవలకు గాను ప్రత్యేక పురస్కారాలను అందజేశాయి. తాజాగా ‘తెలుగు టైమ్స్ & టీవీ- బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్- 2023’ అవార్డు డాక్టర్ జగదీష్ యలమంచిలిని వరించింది. ఈక్రమంలోనే ఆయన ఆ అవార్డును అందుకోవడంతో శ్రేయోభిలాషులు.. యూబ్లడ్ యాప్.. జై స్వరాజ్ టీవీ నిర్వాహకులు.. అభిమానులు డాక్టర్ జగదీష్ యలమంచిలికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.