36 C
India
Monday, April 29, 2024
More

    HBD Dr Jai : క్యూబ్ ఆర్ట్.. పుట్టినరోజున డా.జగదీష్ బాబు యలమంచిలి గారికి గిఫ్ట్.. వైరల్ వీడియో

    Date:

    HBD Dr Jai (Jagadish Babu Yalamanchili)
    HBD Dr Jai (Jagadish Babu Yalamanchili)

    HBD Dr Jai (Jagadish Babu Yalamanchili ) : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం వారిదే..సమాజాన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు..ఎవరినీ చూసినా ఆస్తుల సంపాదనే తప్ప ఆత్మీయత ఎక్కడుంది?’’ అని నిట్టూర్చడం ఇప్పుడు సహజమైపోయింది. కానీ మనుషుల్లో ఇంకా మంచితనం మిగిలే ఉంది. సామాజిక సేవే పరమావధిగా తరించే వ్యక్తులు అరుదుగానైనా మనకు కనపడుతునే ఉంటారు. వారిలో యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు ఒకరని చెప్పొచ్చు.

    Read more : జై యలమంచిలిని సత్కరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

    సమాజం కోసం తన వంతుగా..

    మానవ శరీరంలో అత్యంత కీలక భూమిక పోషించేది రక్తమే. శరీరంలోని అన్ని అవయవాలకు పోషక పదార్థాలు, ఆక్సిజన్ తీసుకెళ్లేది రక్తమే. అలాంటి రక్తాన్ని ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించలేదు. రక్తం దానం చేస్తే మరో వ్యక్తికి జీవితాన్ని ఇచ్చినట్టే అవుతుంది. అందుకే ‘రక్తదానం మహాదానం’ అన్నారు మన పెద్దలు. సరైన సమయంలో రక్తం లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలను వదులుతున్నారు. కీలకమైన ఆపరేషన్లు చేస్తున్న సమయంలో కూడా రక్తం చాలా అవసరం ఇంత అవసరమైన రక్తాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా కష్టం మూడు నెలల కంటే దాదాపుగా ఎక్కువ నిల్వ చేయలేం. దీని కన్నా లైవ్ బ్లడ్ చాలా మేలని చాలా సందర్భంగాల్లో డాక్టర్లు చెబుతూనే ఉంటారు.

    Read more : యూబ్లడ్ స్థాపనకు డా. జగదీష్ బాబు యలమంచిలి గారిని కదిలించిన అంశాలివే..

    UBlood: Reasons why everyone should download the lifesaving app
    UBlood Founder Jagadish Babu Yalamanchili and Actor Sonu Sood

    ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న  యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు తన వంతుగా ఈ విషయంలో సమాజానికి ఏదైనా చేయాలని తలిచారు. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే ‘యూ బ్లడ్’ యాప్. ఆయన తండ్రి కోరిక మేరకు ఎన్నో రోజులు కష్టపడి ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చారు. దీని ద్వారా సరైన సమయంలో గ్రహీతకు లైవ్ బ్లడ్ అందుతుంది. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకుంటే సమీపంలోని గ్రహీతకు మెసేజ్ వెళ్తుంది. అంటే దాత వెంటనే హాస్పిటల్ లేదా రక్తదాన కేంద్రానికి వచ్చి లైవ్ లో రక్తం ఇవ్వచ్చు. ఇలాంటి యాప్ వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించేందుకు వీలు కలుగుతుంది.

    Dr. Jagadish Babu Yalamanchili
    Dr. Jagadish Babu Yalamanchili

    జన హృదయాలను గెలుచుకుని..

    యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు  ఇండియా నుంచి వచ్చి అమెరికాకు వెళ్లి భారతీయుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగదీష్ యలమంచిలి గారు ‘యూ బ్లడ్ (UBLOOD) యాప్ ప్రారంభించిన తర్వాత ఎంతో మందికి ప్రాణం పోశారని, ఆయన ఇండియన్ కావడం తమకు గర్వకారణమని ఎన్ఆర్ఐలు కొనియాడుతుండడం విశేషం. యూబ్లడ్ యాప్ రానంత వరకు అత్యవసర సమయంలో రక్తం కావాలంటే పేషెంట్లు, వారి బంధువులు ఇబ్బందులు పడేవారని.. ఈ యాప్ వచ్చిన తర్వాత భరోసా కలిగిందని వారు చెబుతుండడం గమనార్హం. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ యలమంచిలిగారిని మరువలేమన్నారు.

    Read more : తమన్నా చేతుల మీదుగా డా. జగదీష్ బాబు యలమంచలి గారికి సన్మానం

    కాగా,  భారత స్వాతంత్ర దినోత్సవం (ఆజాదీకా అమృత్ మహోత్సవం)లో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ లో భారత స్వాతంత్ర దినోత్సవ పరేడ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినీనటి తమన్నా భాటియా హాజరయ్యారు. యూ బ్లడ్ యాప్ గురించి తెలుసుకున్న ఆమె జగదీష్ యలమంచిలి సేవలను కొనియాడారు. తాను కూడా ఈ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.

    UBlood Campaign Sankranthi Sambaraalu Event at Ravindra Bharathi

    అనంతరం జై (జగదీష్) తమన్నాను శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధీరేన్ అమీన్, చైర్మన్ అండ్ సెక్రటరీ, ఆయన టీమ్, భారతీయ జనతా పార్టీ నాయకుడు నాయకుడు పాతూరి నాగభూషణం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగదీష్ యలమంచిలి గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ యాప్ గురించి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడారు. డా. జగదీష్ బాబు యలమంచిలి, ఆయన తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయని చెప్పారు.

    UBlood campaign at Aurora degree and PG college Photos

    4 లక్షల డౌన్ లోడ్స్..

    సొంత ఖర్చుతో చాలా రోజులు శ్రమించి ‘యూ బ్లడ్’ యాప్ ను తీసుకువచ్చారు జగదీష్ బాబు యలమంచిలి గారు. దీంతో లైవ్ బ్లడ్ పొందే వీలుండడంతో చాలా మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. బ్లడ్ అవసరం ఉన్న వారు నియరెస్ట్ గా దాతల వివరాలు పొందేందుకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు ఈ యాప్ ను 4 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. రోజు రోజుకూ డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి. సరైన సమయంలో రక్తం దొరికిన వారు డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారికి అభినందనలు తెలుపుతున్నారు.


    ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్స్..

    యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారి జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న ఘనంగా నిర్వహిస్తున్నారు. సమాజం పట్ల ఆయన ప్రేమకు, ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన జన్మదినం సందర్భంగా వందలాది ఎన్ఆర్ఐలు, శ్రేయోభిలాషులు, ఆయన సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఓ అభిమాని  క్యూబ్ ఆర్ట్ ద్వారా ఓ అరుదైన గిఫ్ట్ అందజేశారు. క్యూబ్ ఆర్ట్ ద్వారా ఆయన ముఖచిత్రాన్ని రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related