38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Dr. Jagadish Babu Yalamanchili : ఘనంగా యూబ్లడ్ ఫౌండర్ డా.జగదీష్ బాబు యలమంచిలి గారి జన్మదినోత్సవం..విజయవాడలో వందలాది మందికి అన్నదానం

    Date:

     Dr. Jagadish Babu Yalamanchili
    Dr. Jagadish Babu Yalamanchili

    Dr. Jagadish Babu Yalamanchili : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం వారిదే..సమాజాన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు..ఎవరినీ చూసినా ఆస్తుల సంపాదనే తప్ప ఆత్మీయత ఎక్కడుంది?’’ అని నిట్టూర్చడం ఇప్పుడు సహజమైపోయింది. కానీ మనుషుల్లో ఇంకా మంచితనం మిగిలే ఉంది. సామాజిక సేవే పరమావధిగా తరించే వ్యక్తులు అరుదుగానైనా మనకు కనపడుతునే ఉంటారు. వారిలో యూబ్లడ్ ఫౌండర్ డా.జగదీష్ బాబు యలమంచిలి గారు ఒకరని చెప్పొచ్చు.

    యూబ్లడ్ ఫౌండర్ డా.జగదీష్ బాబు యలమంచిలి గారి జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న(శుక్రవారం) ఘనంగా నిర్వహించారు. సమాజం పట్ల ఆయన ప్రేమకు, ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా వందలాది ఎన్ఆర్ఐలు, శ్రేయోభిలాషులు, ఆయన సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఓ అభిమాని  క్యూబ్ ఆర్ట్ ద్వారా ఓ అరుదైన గిఫ్ట్ అందజేశారు. క్యూబ్ ఆర్ట్ ద్వారా ఆయన ముఖచిత్రాన్ని రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    కాగా, డా.జగదీష్ బాబు యలమంచిలి గారి జన్మదినం సందర్భంగా విజయవాడలో వందలాది మంది అన్నార్థులకు, అనాథలకు, బాటసారులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్ని దానాల్లో కెల్ల అన్నదానం మిన్న అనే మన పెద్దల మాటను నిజం చేస్తూ ఎంతో మంది క్షుద్బాధతో బాధపడుతున్న పేదలకు అన్నదానం నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా వారు అన్నదాత సుఖీభవ అంటూ డా.జగదీష్ బాబు యలమంచిలి గారిని కొనియాడడం విశేషం.

    యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు  ఇండియా నుంచి వచ్చి అమెరికాకు వెళ్లి భారతీయుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగదీష్ యలమంచిలి గారు ‘యూ బ్లడ్ (UBLOOD) యాప్ ప్రారంభించిన తర్వాత ఎంతో మందికి ప్రాణం పోశారు.

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related