UBlood App : డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు స్థాపించిన ‘యూ బ్లడ్ (నోబుల్ టూ సేవ్ లైఫ్)’ యాప్ ఎంతో మందికి ప్రాణదానం అందిస్తోంది. ‘ఒకరి రక్తం మరొకరికి ప్రాణం’ అంటూ ఆయన నినాదం ఆపన్నులకు భరోసానిస్తోంది. డా.జై గారు స్థాపించిన ఈ సంస్థ ద్వారా వేలాది కుటుంబాలు నేడు ఆనందంలో ఉన్నాయి. యూ బ్లడ్ ను స్థాపించినప్పటి నుంచి తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది నుంచి సేకరించిన బ్లడ్ ను కష్టాల్లో ఉన్న వారికి అందజేసి ప్రాణాలను కాపాడుతున్నారు జై యలమంచిలి.
యూబ్లడ్ యాప్ ద్వారా తన సేవా కార్యక్రమాలను కూడా మరింత విస్తృత పరచాలనుకుంటున్నారు జై యలమంచిలి. దీనికి తగ్గట్లుగా తాను పాల్గొన్న ప్రతీ కార్యక్రమంలోనూ ‘యూబ్లడ్’ తో జరిగే మేలును.. ఈ యాప్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చో సోదాహరణంగా వివరిస్తున్నారు.
తాజాగా ఆదివారం విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో సేవా భారతి విజయవాడ బాలమేళా అభ్యాసికల విద్యార్థిని విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయవాడ సేవ భారతి అధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్ గారు, కార్యదర్శి శుభ శేఖర్ మరియు కోఆర్డినేటర్ మాధురి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ ఆదిత్య గారు, UBlood ఫౌండర్ డాక్టర్ జగదీశ్ బాబు యలమంచిలి గారు, వికాస్ కౌశిక్ గారు ,లక్ష్మీప్రసాద్ గారు మల్లికార్జున రావు గారు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా UBlood ఫౌండర్ డాక్టర్ జగదీశ్ బాబు యలమంచిలి గారు మాట్లాడుతూ.. ‘యూబ్లడ్ రక్తదానం వల్ల మనుషుల ప్రాణాలు కాపాడింది.మీ రక్తదానం.. మరొకరి ప్రాణదానంగా మారింది. ఇదొక సైక్లిక్ ప్రాసెస్. ప్రతీ ఒక్క మనిషి ప్రాణం పోగొట్టుకోకూడదు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే 50 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 50 కోట్ల మంది డోనర్స్ గా మారితే ఎక్కడ ఎవరికి ఎమర్జెన్సీ వచ్చినా అవసరం అయ్యేది బ్లడ్.. బ్లడ్ గ్రూప్ .. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడాలన్నదే మా ‘యూబ్లడ్’ లక్ష్యం. యూ బ్లడ్ యాప్ ఉచితం.. ప్లీజ్ బికమ్ ఏ డోనర్. రిజిస్ట్రేషన్ చేసుకోండి.. సేవ్ లైవ్స్’ అంటూ డా.జై గారు పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందుముందు మేం కొనసాగిస్తామని తెలిపారు.