32.5 C
India
Thursday, May 2, 2024
More

    National Blood Donation Day : జాతీయ రక్తదాన దినోత్సవం : ప్రాణం పోస్తున్న ‘యూ బ్లడ్’కు సెల్యూట్

    Date:

    National Blood Donation Day,
    National Blood Donation Day UBlood, Dr. Jai and Sonu Sood

    National Blood Donation Day : ‘రక్తం’ శరీరంలో అత్యంత కీలక భూమిక పోషించే ద్రవం. కృత్రిమంగా అవయవాలు తయారు చేస్తున్న శాస్త్ర వేత్తలు రక్తాన్ని మాత్రం ఇప్పటి వరకు కృత్రిమంగా తయారు చేయలేకపోయారు. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నా.. ఎప్పటికి సాధ్యం అవుతుందో తెలియదు. ఇదంతా పక్కన పెడితే.. భగవంతుడి సృష్టిలో రక్తం కూడా ఒక అపూర్వమనే చెప్పవచ్చు. శరీరంలో జీవక్రియ సజావుగా సాగాలంటే రక్తమే కీలక భూమిక పోషిస్తుంది. శరీరంలోని ప్రతీ అవయవం వద్దకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లేది రక్తమే. రక్తం లేకుంటే అన్ని అవయవాలు నాశనం అవుతాయి.

    శరీరంలో ఇంత ప్రధాన భూమిక పోషిస్తున్న రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు రక్తహీనతతో బాధపడుతున్న వారు కాగా.. మరికొందరు యాక్సిడెంట్లలో గాయాలపాలైనవారు.. ఇంకొందరు ఆపరేషన్లు చేయించుకుంటున్న వారు. ఇలా రక్తం సరైన సమయంలో దొరకక చాలా మంది లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఈ రోజు (అక్టోబర్ 1) ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’ సందర్భంగా ఈ కథనం మీ కోసం..

    రక్తం, అది శరీరంలో చేసే పాత్ర గురించి తెలుసుకున్న మనం రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. కాస్త ఆలోచించండి.. నీలోని రక్తం మరొకరికి ప్రాణదానం చేస్తుంది. అంటే పరోక్షంగా మీరు ఇంకొకరికి ప్రాణాలను నిలబెడుతున్నారన్న మాట ఈ మాట వింటేనే ఆనందంగా ఉంటుంది. కదా.. మీ రక్తం రక్త లేమి వ్యాధి గ్రస్తులకు, యాక్సిండెంట్లలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న వారికి.. ఆపరేషన్ అవసరమున్న వారికి అవసరం కావచ్చు. ఇప్పటికే ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు రక్త దానం గురించి అవగాహనలు కల్పించాయి. మరెన్నో రక్తదాన క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి.

    రక్తదానంతో మరొకరి ప్రాణాలను నిలబెట్టవచ్చు అని గ్రహించిన జై స్వరాజ్య టీవీ వ్యవస్థాపకుడు డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు ఒక యాప్ ను రూపొందించారు. అదే ‘యూ బ్లడ్’ యాప్. సాధారణంగా రక్తదానం క్యాంపుల నుంచి సేకరించిన బ్లడ్ మూడు నెలలు, అంతకు తక్కువ సమయం మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత అది పనికిరాదు. ఇలా తీవ్రంగా నష్టం జరగుతుంది. ఎంతో మంది మానవతా దృష్టితో ఇస్తున్న బ్లడ్ పనికి రాకుండా పోతుందని గ్రహించిన జగదీష్ బాబు యలమంచిలి గారు ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చారు.

    ఈ యాప్ ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. ప్లేస్టోర్ లో యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్ లో ఫ్రీగా ఎంట్రీ చేసుకున్నాక. మీరు బ్లడ్ డొనేట్ చేయాలన్నా.. లేదా బ్లడ్ రిసీవ్ చేసుకోవాలన్నా.. నియరెస్ట్ (సమీపం) గా ఉన్న దాతల వివరాలను ఈ యాప్ మీకు చూపుతుంది. రక్తం కావాలన్నా.. ఇవ్వాలన్నా.. నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. ఎలాంటి మీడియేటర్ ఉండడు. పైగా డబ్బులు కూడా ఖర్చు కావు. దీనికి తోడు లైవ్ బ్లడ్ కూడా దొరుకుతుంది. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగదీష్ బాబు యలమంచిలి గారికి జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలపాల్సిందే..

    Share post:

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related