NATS Financial Planning : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూజెర్సీ, ఎడిసన్‌లో ఆర్థికాంశాలపై అవగాహన సదస్సు నిర్వహించింది. ఆర్థిక నిపుణుడు ఏజీ ఫిన్‌టాక్స్ (AG FinTax), నాట్స్ వ్యవస్థాపకుడు అనిల్ గ్రంథి ఆర్థిక అవగాహన కల్పించారు.
2023 టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, 2024 ప్రణాళికపై క్షుణ్ణంగా వివరించారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు వచ్చే పన్ను ప్రయోజనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలకు టాక్స్ క్రెడిట్ రూల్స్ లాంటి అంశాలపై సమగ్ర అవగహన కల్పించారు.
క్యాపిటల్ గైన్ ట్యాక్స్ ను తగ్గించుకోవడం ఎలా? వ్యాపారులు, ఉద్యోగులు పన్నులు, ఆర్థికాంశాలపై ఎలా అప్రమత్తంగా ఉండాలని అనిల్ గ్రంథి వివరించారు. 200 మందికి పైగా తెలుగు వారు సదస్సులో పాల్గొన్నారు. ఫేస్ బుక్ లైవ్ కూడా ఏర్పాటు చేయడంతో చాలా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
అమెరికాలో ఆర్థిక అంశాలపై ఇంత ఉపయుక్తమైన సదస్సును నిర్వహించడంపై సదస్సుకు వీచ్చేసిన ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్, న్యూజెర్సీ నాట్స్ విభాగాధిపతులు శ్యామ్ నాళం, టీపీ రావు, బిందు యలమంచిలి, సురేష్ బొల్లు, మురళీ కృష్ణ మేడిచెర్ల, బస్వ శేఖర్ శంషాబాద్, దేసు గంగాధర్, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్ వెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, డా. సూర్యం గంటి, చక్రధర్ వోలేటి, తదితరులు, వలంటీర్లు సదస్సు విజయవంతం చేసేందుకు కృషి చేశారు.
జై స్వరాజ్య గ్లోబల్ టీవీ అడ్వయిజర్, యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారి కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. సరైన టాక్స్ సమయంలో ఈ కార్యక్రమం చేసినందుకు టీం సభ్యులందరికీ నాట్స్ మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి అభినందనలు తెలిపారు.
ఆర్థిక అంశాలపై చక్కటి సదస్సు నిర్వహించడంలో సహకరించిన ప్రతీ సభ్యుడికి నాట్స్ అధ్యక్షుడు బాపయ్య నూతి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
All Images Courtesy by Dr. Shiva Kumar Anand