Varun Tej : లావణ్య త్రిపాఠితో మ్యారేజ్ ముగిసిన తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టారు వరుణ్ తేజ్. ఇందులో భాగంగా వస్తున్నదే ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా నిర్మాణం పూర్తయి, రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజైంది. మార్చి 1వ తేదీ రిలీజ్ కానుండడంతో ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు ఆయన. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను సాయి పల్లవితో కలిసి ఒక సినిమా చేశానని ఆ తర్వాత మరో మూవీలో కనిపించకపోవడంపై స్పందించారు.
‘ఫిదా’ అందరికీ గుర్తుండే ఉంటుంది. వరుణ్ తేజ్, సాయి పల్లవి పేర్ ఈ సినిమాకు హైలట్ గా నిలిచింది. ఎన్‌ఆర్‌ఐగా వరుణ్ తేజ్ కనిపించగా.. తెలంగాణ ఖతర్నాక్ పిల్లగా సాయి పల్లవి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో మరో చిత్రం కోసం ఇరు వైపులా ఫ్యాన్స్ ఈగల్ గా వెయిట్ చేశారు. కానీ ఆ కాంబో కనిపించలేదు. దీనిపైనే వరుణ్ తేజ్ ఇంటర్వ్యూలో స్పందించారు. మళ్లీ తాము కలిసి నటించకపోవడంపై కారణం తెలిపారు. ఫిదా తర్వాత మా కాంబోపై మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఇద్దరం కథ కూడా విన్నాం. కానీ, ఫిదాను మించిన కథలా అనిపించలేదు. ఈ సారి చేస్తే ‘ఫిదా’ను మించి ఉండాలని, లేకుంటే చేయద్దని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఈ కారణంతోనే ఇద్దరం కలిసి నటించలేదు.’ అని వరుణ్ వివరించారు.
అయితే, గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. దీనికి సీక్వెల్ చేయాలని ఆలోచన కూడా ఉందన్నారు వరుణ్. నితిన్, సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించాలని ఉంది అన్నారు. నితిన్ కు తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని చెప్పిన ఆయన ఒక సినిమా హిట్, ఫ్లాప్ ను పట్టించుకోనని చెప్పారు. ‘గాండీవధారి అర్జున’ విషయంపై స్పందిస్తూ.. హీరో క్యారెక్టర్‌కు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని భావిస్తున్నట్లు చెప్పారు.
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న రిలీజ్ అవుతుంది. శక్తి ప్రతాప్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపిస్తున్నారు. మానుషి చిల్లర్ ఆయన సరసన నటిస్తోంది.