Mythri Movie Makers : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన మైత్రీ మూవీ మేకర్స్ మొదట్లో కొంచెం తడబడింది కానీ వేగంగా నిలదొక్కుతుంది. రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన రెండు భారీ చిత్రాలకు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించింది. నైజాం ఏరియాలో సలార్, హను-మాన్ అనే రెండు పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి రెండు కూడా భారీ హిట్లను అందించింది. సంస్థ థియేటర్లలో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు మైత్రీ మూవీ మేకర్స్ పక్కా వ్యూహాలు రచించింది. అందులో సక్సెస్ అయ్యింది.
మైత్రీ మూవీ మేకర్స్ మరో భారీ సినిమాతో నైజాం డిస్ట్రిబ్యూటర్ గా మరోసారి ముందుకు రాబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తెలుగు – హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ నైజాం హక్కులను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఖచ్చితంగా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. కాబట్టి నైజాంలో భారీ రిలీజ్ ఆశించవచ్చని మైత్రీ మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ చేసి రెండు మూడు రోజులు గడిచినా భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఈ తరహా పాత్ర ఏ మూవీలోనూ వేయలేదు. పైగా సినిమా కూడా యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఇది కూడా ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకచ్చేందుకు దోహదం చేస్తుంది. రిలీజ్ కాకముందే సినిమాపై బాక్సాఫీస్ అంచనాలుఉన్నాయి. ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. మార్చి 1న ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలకు సిద్ధమవుతోంది.