24.7 C
India
Sunday, June 23, 2024
More

    Crime News : హంతకులను పట్టించిన సెల్ ఫోన్.. అన్నీ ఆ ఫొటోలే..

    Date:

    Crime News
    Crime News

    Crime News : కొందరు గృహిణుల ప్రవర్తన చూస్తే రాను రాను కుటుంబ వ్యవస్థ అనేది ఉండదేమోనని భయం వేస్తుంది. ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకోవడం.. లేదంటే ఎఫైర్ పెట్టుకోవడం అడ్డుగా ఉన్నారని భర్తను, కొన్ని సందర్భాల్లో పిల్లలను కూడా చంపడం, చంపించడం. ఇదేనేమో కలియుగం ప్రభావం అంటే.

    ఇలాంటి ఒక హత్య కేసును పోలీసులు ఇటీవల ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ కు చెందిన జాదవ్ గజానంద్ జైనాథ్ అనే టీచర్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. 40 సంవత్సరాలు ఉన్న ఆయన టీచర్, భార్యా పిల్లలతో హాయిగా ఉంటున్న ఆయనను ఎవరు హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దర్యాప్తులో ఈ కేసు అస్సలు ముందుకు వెళ్లడం లేదు. హత్య అని ఘటనా ప్రదేశాన్ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. కానీ ఎవరు? ఎందుకు? చేశాన్నది తేలడం లేదు.

    ఆయన భార్య విజయలక్ష్మిని విచారించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నిందితులను శిక్షించాలని, నా భర్తకు శత్రువులు లేరు. అంటూ చెప్తూ వచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తులో రెండు అడుగులు వెనక్కి వేశారు. ఇక తాము దొరికిపోమని నిందితులు ఊపిరి పీల్చుకున్నారు. గండం నుంచి బయట పడ్డామని అనుకున్నారు. కానీ నిజం ఎన్నో రాజులు దాగదు కదా? నిందితులు వాడే ఫోనే వారిని పట్టించింది.

    జైనాథ్ హత్యకు కారణం అతని భార్యనేనని ఆధారలు బటయపడ్డాయి. ఆమె కాల్ లిస్ట్, సెల్ ఫోన్ లో ఫొటోలు పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడ్డాయి.  జైనాథ్ భార్య విజయలక్ష్మికి అదే గ్రామినికి చెందిన మహేశ్ అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఉంది. వీరి మధ్య తరుచూ ఆమె భర్త జైనాథ్ రావడంతో ఆయనను ఎలాగైనా హత్య చేయించాలని మహేశ్ తో కలిసి ప్లాన్ చేసింది. ఒక గ్యాంగ్ కు సుపారీ కూడా ఇచ్చింది. తన భర్త స్కూల్ కు వెళ్లే రోడ్డు, వచ్చే రోడ్డు తదితర వివరాలను గ్యాంగ్ కు అప్పగించింది.  వారు హత్య చేయడంతో ఊపిరి పీల్చుకుంది.

    భర్త హత్య తర్వాత ఏడ్వడం, బాధగా ఉండడం, బంధువులకు, పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించడం చేసింది. కానీ పోలీసులు కాల్స్, ఫొటోల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. విజయలక్ష్మి, మహేశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. సుపారీ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు.

    Share post:

    More like this
    Related

    NEET PG Exam : నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా

    NEET PG Exam : దేశవ్యాప్తంగా ఈరోజు (జూన్ 23) నిర్వహించాల్సిన...

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం....

    Virat Kohli : ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. భారత కోచ్ సంచలన వ్యాఖ్యలు

    Virat Kohli : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Choppadandi MLA Wife : చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

    ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం Choppadandi MLA Wife Sucide :...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    40 Thousand Bill : అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..

    40 Thousand Bill : కొత్త రకం మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది....

    Signal Break : సిగ్నల్ బ్రేక్.. సికింద్రాబాద్ లో మూడు పల్టీలు కొట్టిన కారు

    Signal Break : సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....