Aamani : క్యాస్టింగ్ కౌచ్ అనే పదం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ముద్దుగుమ్మలంతా ఈ కాస్టింగ్ కౌచ్ మీద చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట ఓ ఊపు ఊపేస్తున్నాయి.. ఇది వరకు ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి భయపడిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి వారికీ జరిగిన దారుణాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు..
ప్రస్తుతం బుల్లితెర నుండి వెండితెర వరకు సీనియర్ నుండి కుర్ర భామల వరకు ఎవరో ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.. ఆ కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమనీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ మీద కామెంట్స్ చేసింది..
స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచిగా రాణిస్తుంది.. తాజాగా ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది.. కాకపోతే హీరోయిన్స్ మీదనే ఇది ఆధారపడి ఉంటుంది.. ఒక సినిమాలో నేను హీరోయిన్ గా చేస్తున్నప్పుడు డైరెక్టర్ నా రూమ్ లోకి వచ్చాడు..
ఈ రోజు స్విమ్మింగ్ పూల్ లో షూట్ ఉంది.. నీ శరీరం మీద స్క్రాచ్ లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలి డ్రెస్ తీసేయ్ అన్నాడు.. నాకు అనుమానం వచ్చి నేను అలాంటి సీన్ లో నటించను అని చెప్పాను.. మరోసారి మేనేజర్ వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియర్ చూడాలని అంటున్నారు కార్ ఎక్కు ఎన్నారు.. చుస్తే హీరో, డైరెక్టర్, నిర్మాత చూడాలి కానీ అతనెవరు అని నేను వెళ్ళలేదు.. ఒక్కోసారి అమ్మ లేకుండా నన్ను ఒంటరిగా రమ్మని చెప్పిన నేను అనుమానం వచ్చి అలా ఎప్పుడు వెళ్ళలేదు.. అంటూ ఈమె రకరకాల అనుభవాలను పంచుకుంది..