35.8 C
India
Monday, May 20, 2024
More

    Chandrababu Quash Petition : నేడు సుప్రీం కోర్టులో ఏం జరగనుంది..? చంద్రబాబు కేసు పై సర్వత్రా ఉత్కంఠ

    Date:

    tdp chief chandrababu quash petition in supreme court
    Today is Chandrababu Quash Petition hearing in Supreme Court

    Chandrababu Quash Petition :

    టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టు మెట్లెక్కారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. అత్యవసరంగా ఈ పిటిషన్ ను విచారించాలని ఆయన తరఫున న్యాయవాదులు సీజేఐని కోరడంతో, ఆయన సమ్మతించారు. మరోవైపు ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ పై నా కూడా విచారణ జరగనుంది. సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో జరిగే పరిణామాలకు అనుగుణంగానే ఏసీబీ కోర్టులో విచారణ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తున్నది.

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడాని సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిగణనలోకి తీసుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిలతో కూడిన ధర్మాసనం దీనిని విచారించనుంది. అయితే రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే  ఈ కేసు నమోదు చేశారని, రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు తరఫున న్యాయవాదులు పిటిషన్  లో పేర్కొన్నారు. 2018లో తీసుకొచ్చిన అవినీతి నిరోధక ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

    ఇక ఇదే అంశంపై అటు ఏపీ హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. ఇందులో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా ఉంది. మరి చంద్రబాబుకు ఊరట లభిస్తుందా  వేచి చూడాల్సి ఉంది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసంటూ సీఐడీ మరొకటి నమోదు చేసింది. దీనిలో కూడా బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తాజాగా యువనేత నారాలోకేశ్ ను ఏ14గా నమోదు చేశారు. మరోవైపు ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది. సుప్రీం కోర్టులో ఈ రోజు తర్వాత అక్టోబర్ 3 వరకు సెలవులు ఉన్నాయి. దీంతో ఈ రోజు జరిగే విచారణ పైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...