26.7 C
India
Saturday, June 29, 2024
More

    TRAI : ఇక ఆ నెంబర్లు పని చేయవు.. యూజర్లపై గట్టి చర్యలు తీసుకున్న ట్రాయ్

    Date:

    TRAI
    TRAI

    TRAI : ప్రస్తుతం మొబైల్ వినియోగం భారీగా పెరిగింది. అందులో రెండు నెంబర్ల వాడకం పరిపాటిగా మారింది. మొబైల్ వచ్చిన కొత్తలో హ్యాండ్ సెట్ కు ఒకే సిమ్ వర్క్ చేసేది. కానీ రాను రాను డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్ల వాడకం పెరిగింది. దీంతో హ్యాండ్ సెట్ కు రెండు ఐఎంఈఐ నెంబర్లు ఒక్కోదానిలో ఒకటి చొప్పున రెండు  నెంబర్లు పరిపాటిగా మారింది. దీంతో సైబర్, ఆర్థిక నేరాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

    స్పెషల్ క్యాంపెయిన్..
    కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించిన వెరిఫికేషన్ క్యాంపెయిన్ విజయవంతమైంది. ఈ విషయాన్ని కమ్యూనికేషన్స్ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ స్పష్టం చేశారు. అక్రమంగా, విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకొని సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమం కొనసాగుతుండగా, నేరాలను అదుపు చేయడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది.

    ఆ ఫోన్ నెంబర్లు డియాక్టివేట్..
    నేరాలను అదుపు చేయడంలో భాగంగా ప్రభుత్వం నకిలీ మొబైల్ ఫోన్ కనెక్షన్లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టింది.  నకిలీ పత్రాల ద్వారా సంపాదించిన 5.5 మిలియన్ ఫోన్ నంబర్లను డియాక్టివేట్ చేసింది. దీనికితోడు సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడిన 1.32 లక్షల హ్యాండ్సెట్లను కూడా బ్లాక్ చేసింది. ఇందులో భాగంగా  13.42 లక్షల కనెక్షన్లు అనుమానాస్పదంగా ఉండడంతో  తొలగించింది. ఈ  ప్రయత్నం సైబర్ భద్రతను పెంపొందించడానికి, మోసపూరిత ఫోన్ నంబర్ల ద్వారా నేరాలతో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి చేపట్టింది.

    వినియోగదారులకు అవగాహన
    మొబైల్ వినియోగించే వారు నేరస్తుల, సామాన్యుల తెలుసుకోవడం కష్టం. అందులో భాగంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను ముందుగా వారికి వివరించింది. సమస్యను మరింత పరిష్కరించడానికి ప్రభుత్వం వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వారు వాడుతున్న మొబైల్ కనెక్షన్ల గురించి తెలియజేయడానికి, మోసాలు జరిగే తీరుపై వివరించడానికి ఈ క్రమం చేపట్టింది.

    Share post:

    More like this
    Related

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలు.. ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    Italy : ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం – 14న జీ-7 సదస్సులో పాల్గొననున్న పీఎం మోదీ

    Italy : ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం...

    Black Cat Commandos : భద్రత విధుల నుంచి తప్పుకోనున్న ‘బ్లాక్ క్యాట్’

    Black Cat Commandos : భద్రత విధుల నుంచి ‘బ్లాక్ క్యాట్’...