నిన్నటి వరకు యూ ట్యూబర్ గా కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిచయమైన పేరు వైష్ణవి చైతన్య. కానీ నేడు దేశం యావత్తు ఈమె గురించి తెలిసిపోయింది. కేవలం తన ఫస్ట్ మూవీ ‘బేబీ’తో దేశంలోని యువతను తన వైపునకు చూసేలా చేసింది ఈ యూ ట్యూబర్ (ప్రస్తుతం హీరోయిన్). ఈ సినిమాలో ఆమె తన నటనను పూర్తిగా పెట్టినట్లు కనిపించింది. ఈమెను చూసిన ఇతర రాష్ట్రాల అభిమానులు ఇన్నాళ్లు ఇంత అందంగా ఉన్న వైష్ణవి ఎక్కడ ఉంది? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. యూట్యూబ్, గూగుల్ లో ఆమె వీడియోస్ చూస్తున్నారట. గతంలో కంటే ఆ వీడియోలకు ఇప్పుడు ఎక్కువ వ్యూవ్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆమె యూ ట్యూబ్ లో చేసిన వీడియోల్లో పాపులర్ అయ్యింది ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’. ఇందులో ఆమెతో కలిసి షణ్ముఖ్ జస్వంత్ నటించాడు. ఇందులో కూడా వైష్ణవి అత్యంత అద్భుతంగా నటించింది.
ఇదంతా పక్కన పెడితే.. ఆమె చేసిన వీడియోస్ తో పాటే.. ఆమె ఇంటర్వ్యూ వీడియోస్ కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. గతంలో బిత్తిరి సత్తి ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ టీంతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. అందులో వైష్ణవి, షణ్ముఖ్ ఉన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ‘నీకు ఎలాంటి డ్రీం బాయ్ కావాలని కోరుకుంటున్నావు?’ మహేశ్ బాబు రేంజ్ లోనా? అని సత్తి వైష్ణవిని ప్రశ్నించాడు. దానికి వైష్ణవి సమాధానం చెప్తూ అంతరేంజ్ అవసరం లేదని చెప్పింది. నా మనస్తత్వానికి తగ్గట్టు ఉంటే చాలు అని పేర్కొంది.
వెంటనే సత్తి షణ్ణు లాంటోడు కావాలా? అని ప్రశ్నించగానే. వద్దు వద్దు నాకు ఇలాంటోళ్లు అస్సలు వద్దు అని చెప్పింది. షణ్ణు ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పింది. ఈ వీడియో ఇప్పడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తనకు మంచి మొగుడే వస్తాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ReplyForward
|