39.4 C
India
Monday, April 29, 2024
More

    Vaishnavi Chaitanya : బుడిబుడి అడుగులేస్తున్న ‘బేబీ’ హీరోయిన్..!

    Date:

    Vaishnavi Chaitanya :

    టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు ఎంతమంది ఉన్నారంటే వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అందులోనూ యంగ్ హీరోయిన్ల కొరత మరీ ఎక్కువగా ఉంది. తెలుగు హీరోయిన్లకు ఒకరిద్దరు డైరెక్టర్లు ఆఫర్లు ఇచ్చినా సినిమా ఆడకపోవడమో.. లేదంటే గ్లామర్ చూపించకపోవడం కారణంగా ఆ తర్వాత వారికి ఛాన్సులు రాకుండా పోతున్నాయని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.

    ఇటీవలి కాలంలో తెలుగు హీరోయిన్లు సైతం గ్లామర్ చూపించడంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. తెలుగమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంటున్న శ్రీ లీల ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఒకే ఒక్క హిట్టుతో బిజీ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల పక్కన ఛాన్సులు దక్కించుకుంటూ జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ ముందుకెళుతోంది.

    మరోవైపు వైష్ణవి చైతన్య సైతం టాలీవుడ్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు ప్లాన్ చేస్తోంది. వెబ్ సిరీసులతో యూత్ క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య తెలుగులో పలు సినిమాల్లో కన్పించింది. చిన్న రోల్ వచ్చిన దానిని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లింది. ఇక ఆమె నటించిన ‘బేబీ’ మూవీ చిన్న సినిమాగా విడుదలై టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

    ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలువురు డైరెక్టర్లు.. నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ఆఫర్లు ఇచ్చారు. అయితే వైష్ణవి ఏమాత్రం తొందరపడకుండా కథ నచ్చితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. క్రేజ్ వచ్చింది కదా? అని ఏది పడితే అది ఒప్పుకోకుండా కెరీర్ ఎక్కువ కాలంగా ఉండేలా జాగ్రత్త పడుతుంది.

    ‘బేబీ’ తర్వాత ఆమె ఒప్పుకున్న సినిమాలను బట్టి చూస్తే ఈ విషయమే అర్థమవుతోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాను అగ్ర నిర్మాతల్లో ఒకరైన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    అదేవిధంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఓ మూవీ చేస్తోంది. ఇందులో దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరో గా నటిస్తుండగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించనున్నారు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్న వైష్ణవికి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో వేచిచూడాల్సిందే..!

    Share post:

    More like this
    Related

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Baby Heroine Next Project : ‘రౌడీ బాయ్స్’తో ‘బేబీ’ నెక్ట్స్ ప్రాజెక్ట్!

    Baby Heroine Next Project : షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా...

    Vaishnavi Chaitanya : ‘వాట్సాప్ బేబీ’.. వైష్ణవి మనస్సు దోచుకుందెవరు?

    Vaishnavi Chaitanya : టిక్ టాక్.. యూట్యూబ్.. ఇన్ స్ట్రా రీల్స్...

    Vaishnavi Chaitanya : పూట గడవడం కోసం ఆ పార్టీల్లో డ్యాన్స్ చేసేదాన్ని.. వైష్ణవి చైతన్య ఎమోషనల్!

    Vaishnavi Chaitanya : బేబీ సినిమా హిట్ తో హీరోయిన్ వైష్ణవి...

    Baby : బేబీ అడుగులు ఎటువైపు.. వైష్ణవి చైతన్య నెక్స్ట్ ఏంటి?

    Baby : వైష్ణవి చైతన్య పేరు ఇప్పుడు మారుమోగి పోతుంది. టిక్...