ప్రస్తుతం థియేటర్లలో భారీగా కలెక్షన్లు రాబడుతున్న సినిమా ‘బేబి’. టీజర్, ట్రైలర్ తో యూత్ ను మొత్తం తన వైపునకు తిప్పుకున్న ఈ చిత్రం రిలీజైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో దాదాపు బాక్సాఫీస్ కలెక్షన్లను దక్కించుకుంటూ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సినిమాతో ఇక వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.
ఆనంద్ ‘దొరసాని’తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ ఒటీటీలో ఒకటి రెండు సినిమాలు తీసినా ఆయనకు బాగా కలిసి రాలేదు. కానీ ‘బేబీ’ మాత్రం విపరీతంగా కలిసి వచ్చింది. బేబీ సక్సెస్ మీట్ ను ప్రస్తుతం చిత్ర బృందం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డైరెక్టర్ సాయి రాజేశ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఆయన బేబీ హీరోయిన్ వైష్ణ చైతన్య గురించి ఇలా చెప్పారు.
‘వైష్ణవి నా బాధ నీ మీదే. ఈ సినిమాతో నీ కెరీర్ ఎక్కడ పాడవుతుందో అని అనిపించేది. ప్రతీ క్షణం అదే ఆలోచించే వాడిని, నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. వాటిని పట్టించుకోవద్దు లైట్ తీసుకో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. నరసింహా రిలీజైనప్పుడు రమ్యకృష్ణ కటౌట్లు కాల్చేశారు. సినిమాలో నీ పాత్ర గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. బాగా చేశావ్ నువ్వు’ అని సాయి రాజేశ్ ఆమెకు సూచించారు. ‘తను అగ్రిమెంట్ మీద సంతకం పెడుతూ ఏడ్చేసింది. అంటే ఇన్ఫినిటమ్ లో మంచిగా ఒక గౌరవ ప్రదమైన శాలరీతో జూబ్లీహిల్స్ లో హ్యాపీగా ఉండేది. సినిమా స్టార్ట్ చేసిన రెండేళ్లలో అత్తాపూర్ కు మారిపోయింది. అన్ని రకాల ఫైనాన్సియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంది.
ఆమెను ఆదుకోవడం నావల్ల కాదని నాకు తెలుసు. అంతా కోల్పోయింది ఈ సినిమా కోసం’ అని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు. ‘చాలా గర్వంగా ఉంది. నన్ను అందరూ పొగుడుతుంటే నాకు ఏమనిపించట్లేదు. మీ ముగ్గురు బాగా చేశారంటే మాత్రం మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నా’ అని దర్శకుడు పేర్కొన్నారు. తన గురించి డైరెక్టర్ చెప్తున్నప్పుడు వైష్ణవి చాలా ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో చూసిన వారంతా వీళ్ల మధ్యలో ఏదో సాగుతుందంటూ గుసగుసలాడుకుంటున్నారు.
ReplyForward
|