Off Lamp in Dream : మనకు కన్నంటుకోగానే కలలు వస్తుంటాయి. కలలో మనం ఎక్కడికో వెళ్లినట్లు అనిపిస్తుంది. కలలో మనకు ఎన్నో రకాల కలలు వస్తాయి. అందులో మంచివి ఉంటాయి. చెడువి వస్తాయి. దీంతో కలలో మనకు కలిగే స్వప్నాలను గురించి ఆందోళన పడుతుంటాం. ఒక్కోసారి ఉలిక్కి పడి లేస్తాం. కలలో ఇలా జరిగిందేమిటి అని ఆలోచిస్తుంటాం. కల ఇంత అధ్వానంగా పడిందేమిటని భయపడుతుంటాం.
కలల గురించి అంత భయపడాల్సిన పనిలేదు. మనకు భవిష్యత్ లో రాబోయే సంఘటనలను కూడా కలలు చూపిస్తుంటాయి. కొన్ని కలలు సంతోషపెట్టేవిగా ఉంటాయి. మరికొన్ని బాధలకు గురిచేస్తుంటాయి. మనకు నిద్రలో పలు రకాల కలలు వస్తుంటాయి. మండుతున్న మంట గానీ వెలుగుతున్న దీపం గానీ మనకు కలలో కనిపిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు.
ఇలా కనిపించడం రాజయోగానికి సంకేతం. ఇలా జరగడం మన జీవితంలో మంచి చోటుచేసుకుంటుందని చెబుతుంది. కలలో అఖండ జ్యోతి కనిపిస్తే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించడం, దీర్ఘాయువుతో జీవిస్తామని అర్థం వస్తుంది. ఇలా మనకు కలలో కనిపించే వాటికి చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయని అర్థం చేసుకోవచ్చు.
కలలో ఆరిపోయిన దీపం కనిపిస్తే మనకు నష్టాలు వస్తాయి. కలలో ఆరిన దీపం కనిపించినట్లయితే చేసే పనుల్లో పురోగతి ఉండదు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకున్నా వెళ్లలేం. ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. పీడకలలు వచ్చినప్పుడు దైవ నామస్మరణ చేయడం మంచిది. ఇలా కలలు మన జీవితంలో ఎంతో ప్రభావం చూపుతాయి.