Bhola Shankar : చిరంజీవి సినిమా అంటే రేంజ్ వీర లెవల్లో ఉంటుంది. ఆయన పేరు చెబితేనే కొందరికి పూనకం వస్తుంది. పూర్వం రోజుల్లో అయితే చిరంజీవి సినిమా మొదటి రోజు చూడాలని ఎంతో ఆరాటపడేవారు. లైన్లో నిలబడి పోలీసు దెబ్బలు తిన్నవారు కూడా ఉన్నారు. అలాంటి చిరంజీవి సినిమా అంటే ఓ రేంజ్ లో జనం ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది.
చిరంజీవి తమన్నా జంటగా నటించిన సినిమా భోళా శంకర్. నేడు విడుదలైంది. ఆన్ లైన్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు వచ్చిన హైప్ కొన్ని గంటల్లోనే అయిపోయాయి. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలకు కొంచెం హైపు తగ్గినా బుకింగ్స్ బాగానే జరిగాయి. కానీ భోళా శంకర్ కు ఈ మేరకు టికెట్లు అమ్ముడుపోకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.
తమిళ సినిమా రీమేక్ కావడం, మెహర్ రమేష్ దర్శకత్వంతో భోళా శంకర్ మీద పెద్దగా అంచనాలు లేవు. చిరు చరిష్మానే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని అనుకున్నారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతాయని అనుకున్నారు. హైదరాబాద్ సిటీలో బుకింగ్స్ ఓపెన్ అయిన అయిదారు రోజుల తరువాత కూడా ఫుల్కాని షోలు వందల్లో ఉండటం గమనార్హం.
మల్టీప్లెక్స్ ల్లో భోళా శంకర్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. రూ. 330 పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్లేందుకు ప్రేక్షకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సింగిల్ థియేటర్లలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా ప్రేక్షకులు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియడం లేదు. చిరంజీవి సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
చిరంజీవి సినిమాకు టికెట్లు అమ్ముడు కాకపోవడం విడ్డూరమే. భోళాశంకర్ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. చిరు సినిమా టికెట్ల వ్యవహారం ఇలా జరగడంతో థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి ఉంది. ఇక సినిమా పరిస్థితేంటో తెలియడం లేదు. సినిమా టాక్ మీద టికెట్ల కథ ముడిపడి ఉంటుంది.