
Gaddar party : తెలంగాణలో మరో పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ త్వరలో పార్టీ పెడుతానని కొన్ని రోజులుగా చెప్తున్నారు. పార్టీ విధివిదానాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పుకుంటూ వస్తు్న్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘యువ సంఘర్షణ సభ’లో గద్దర్ కళాకారులతో పాల్గొన్నారు. సభా వేదికగా ధూంధాం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే పార్టీ పేరును విదివిధానాలను ప్రకటిస్తానని చెప్పారు. దానికి ముందు మేధావులు, కళాకారులు, జర్నలిస్టులతో మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన పార్టీ పెడితే ఎవరికి కలిసి వస్తుంది.. ఎవరికి కీడు చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
లెఫ్ట్ భావాజాలంతో ఎదిగిన గద్ధర్ ఆ పార్టీ నుంచి దూరం అవుతూ వచ్చారు. గతంలో ఆయనపై దాడులు కూడా జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన తన దైన స్టయిల్ ఉద్యమకారులను ఉరకలెత్తించారు. ఉద్యమ పాటలు పాడుతూ, ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా కనిపించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల మళ్లీ వార్తల్లో కనిపిస్తున్నారు. ‘పార్టీ పెడతానని, సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే పోటీ చేస్తానని.. రాష్ట్రంలో ఆయన పాలన ఏమాత్రం బాగాలేదని’ చెప్పుకస్తున్నారు. అయితే ఆయన పార్టీ పెడితే ఎవరికి లాభం చేకూరుతుంది. ఎవరికి నష్టం కలుగుతుందో చూద్దాం.
లెఫ్ట్ ఐడియాలజీ ఎక్కువగా ఉన్న గద్దర్ బీజేపీకి దూరంగా ఉంటారు. మొదటి నుంచి బీజేపీ అంటే ఆయనకు అస్సుల పడదు. ఏ రోజు ఆయన బీజేపీతో కలిసి నడిచింది లేదు. ఉద్యమ సమయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ ధూంధాం సభల్లో ఆయన పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు.
కేసీఆర్ తో బేదాభిప్రాయాలు ఏర్పడడంతో బీఆర్ఎస్ వైపు గద్దర్ వెళ్లడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గద్దర్ ఈ సారి ఎన్నికల్లో ప్రచారం చేపడితే ఇది కూడా కేసీఆర్ కు కలిసి వచ్చేలా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో మొదట ఏమైనా పదవులు వస్తాయా అని ఎదిరి చూసినట్లు, కేసీఆర్ కూడా ఆయనకు ఆఫర్ చేస్తారని అప్పట్లో అనేక చర్చలు నడిచాయి. తెలంగాణ కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసిన కేసీఆర్ గద్దర్ ను కాదని రసమయి బాలకిషన్ కు కేటాయించారు. దీంతో ఇద్దరి మధ్య బాగా తేడాలు వచ్చాయి.
కేసీఆర్ పై పోటీకి సై..
గద్దర్ ఒక వేళ పార్టీ పెడితే ఇటు బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఓట్లను చీలుస్తాడని, అవి కూడా పెద్దగా ఫలితాలను తారుమారు చేసేలా ఉండవని తెలుస్తుంది. అయితే ఉన్నంతలో మాత్రం కేసీఆర్ లాభపడతాడని చెప్పవచ్చు. ఇక కేసీఆర్ ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి పోటీ చేస్తానని అంటున్న గద్దర్ కేవలం సీఎం అభ్యర్థి పైనే పోటీ అని గొప్పలు చెప్పుకునేందుకే కానీ కేసీఆర్ తో పోటీ పడి గెలిచేందుకు ఛరిష్మా గద్దర్ కు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ రెండు పార్టీలను కాదన్న ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తుంటారు. మొదటి నుంచి కాంగ్రెస్ అంటే ఆయనకు అభిమానం ఎక్కవే. ఇటీవల యువ సంఘర్షణ సభలో ఆయన కనిపంచారు. దీనికి తోడు కాంగ్రెస్ నాయకుల పాదయాత్రల్లో కూడా ఆయన కనిపిస్తూనే ఉన్నారు. మర్పే లక్ష్యంగా సీఎల్పీ బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో కూడా ఆయన కనిపస్తున్నారు. అంటే ఆయన పార్టీ పెట్టినా పెట్టకున్నా.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బహూషా ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూడా లాభం చేకూర్చకపోవచ్చు. ఒక వేళ ఆయన ప్రచారం చేయాలనుకుంటే ధూంధాం సభల్లో మాత్రమే పాల్గొంటారని తెలుస్తుంది.