Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈసినిమాకు ఆది నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. మహేశ్ బాబు సినిమా రాక రెండు సంవత్సరాలు అవుతుంది. తన చివరి చిత్రం ‘సర్కారువారి పాట’ 2021లో రాగా.. ఇప్పటి వరకు మరో సినిమా విడుదల కాలేదు. అయితే త్రివిక్రమ్ కథను ఓకే చేసిన తర్వాత నుంచి మహేశ్ బాబుకు కష్టాలు మొదలయ్యాయి.
మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’ బ్లాక్ బస్టర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా దానికి మంచి హిట్ కావాలని మొదలుపెట్టారు. కానీ మహేశ్ బాబు వరుసగా కుటుంబ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ మూవీ స్ట్రాట్ చేసిన తర్వాతనే తన తల్లి చనిపోయింది. ఆ తర్వాత తన తండ్రి కృష్ణ చనిపోయాడు. ఇలా చాలా కాలం ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది.
దీనికి తోడు హీరోయిన్ల నుంచి టెక్నీషియన్ల వరకు మారుతూ వస్తున్నారు. మొదట హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నారు. ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత శ్రీలీలను తీసుకువచ్చారు. కెమెరామెన్ కూడా తప్పుకున్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నాడా? లేడా? అనేది ఎటూ తేలడం లేదు. ఎట్ట కేలకు కృష్ణ జయంతి రోజున (మే 31) సినిమాకు సంబంధించి గ్లింప్స్ రీజ్ చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా గురించి ఇప్పటికీ ఎటువంటి అప్ డేట్ లేదు. మహేశ్ బాబు తన ట్విటర్, ఇన్ స్టా ఖాతా నుంచి కూడా ఎటువంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. పైగా ఈ సినిమాను ఆయన పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తుంది. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన వారికి థ్యాంక్స్ చెప్పాడు కానీ ‘గుంటూరు కారం’ ను మాత్రం పట్టించుకోలేదు. అసలు ఈ మూవీ షూటింగ్ జరుగుతుందా? ఆగిపోయిందా? అనే విషయంపై చిత్రబృందం ఎటువంటి అపడ్ డేట్స్ ఇవ్వడం లేదు.