Virat Kohli :
వెస్టిండీస్ భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.. తొలి ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 312/ 2 తో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ 103, శుభ్ మన్ గిల్ 6 పరుగులతో పెవిలియన్ చేరారు.
అయితే ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ 143 పరుగులు, విరాట్ కోహ్లీ 36 పరుగులతో ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ ఈ 36 పరుగులను 96 బంతుల్లో సాధించాడు.తన మొదటి ఫోర్ 81 బంతుల తర్వాత కొట్టాడు. ఆ సమయంలో విరాట్ నవ్విన తీరు అందరినీ ఆకట్టుకుంది. డగౌట్ వైపు పిడికిలి చూపిస్తూ విరాట్ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సహజ శైలికి భిన్నంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేశాడు. మొదటి ఫోర్ కోసం 81 బంతుల వరకు ఆగడం ఇదే మొదటిసారి. వెస్టిండీస్ బౌలర్ వారికన్ వేసిన 110 ఓవర్లో విరాట్ కోహ్లీ ఈ బౌండరీ సాధించాడు. తొలి బంతి నుంచే విరాట్ కోహ్లీ స్లోగా ఆడడం మొదలుపెట్టాడు.
తన సహజ శైలికి భిన్నంగా ఆడడంతో కోహ్లికి నవ్వు తెప్పించినట్లు అంతా భావిస్తున్నారు. అయితే అభిమానులకు మాత్రం చతేశ్వర్ పూజారా జట్టులో లేని లోటును మాత్రం గురువారం విరాట్ కోహ్లి తీర్చాడు. ఏదేమైనా వెరీ స్పెషల్ విరాట్ కోహ్లి మాత్రం తన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే శుక్రవారం రెండో రోజు మ్యాచ్లో మరి ఇలాగే కొనసాగిస్తాడా.. వేచి చూడాలి. మరోవైపు యశస్వి జైస్వాల్ 150 పరుగులకు చేరువలో ఉన్నాడు. మొదటి రోజులాగే ఆటను కొనసాగిస్తే, రెండో రోజు డబుల్ సెంచరీ సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది.1
ReplyForward
|