Jagan Political Movies :
పాటిటిక్స్, సినిమా రెండింటినీ వేర్వేరుగా చూడడం బహూషా సాధ్యం కాకపోవచ్చు. ఎళ్ల నుంచి సినిమాను ఏలినవారు తర్వాత రాష్ట్రాలను ఏలారు.. ఏలుతున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో సినిమా నటులే పొలిటీషియన్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఇందులో వీరికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రచారానికి సినిమాలు ఎలాగైనా ఉపయోగపడతాయి. ఇవన్నీ సినిమా నటులకు ప్లస్ పాయింట్.
ఇవన్నీ పక్క నుంచితే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు తీయించుకుంటున్న నేతల్లో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకుంది మాత్రం వైసీపీ నేత, ఏపీ సీఎం జగన్. రాంగోపాల్ వర్మతో గతంలో వచ్చిన సినిమా ‘అమ్మ రాజ్యంలో కమ్మ బిడ్డలు’లో జగన్ హీరోగానే కనిపించారు. ప్రత్యర్థులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను చూపెట్టారు వర్మ. ఆ సినిమా అప్పట్లో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. అలాంటి బ్యాక్ డ్రాప్ తోనే మళ్లీ వర్మ ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. భారీ వ్యూవ్స్ తో బాగా సక్సెస్ అయ్యింది.
ఇక, మహి వీ రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర 2’ కూడా వేగంగా పట్టాలెక్కబోతోంది. ఈయన దర్శకత్వంలోనే పెద్దాయన (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) ‘యాత్ర’ సినిమా వచ్చింది. ఈ సినిమా పూర్తిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర గురించి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆయన తీయబోయే చిత్రం ‘యాత్ర 2’ తండ్రి మరణానంతరం వైఎస్ జగన్ చేసిన ‘ఓదార్పు యాత్ర’ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
రాంగోపాల్ వర్మ వ్యూహం, మహి వీ రాఘవ్ యాత్ర 2 జగన్ కు లాభమే చేకూర్చనున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా పొలిటికల్ నేపథ్యంలో వస్తున్నవే. దాదాపు రెండింటిలో కూడా సీఎం జగన్ పాత్రనే హీరో. ఈ సినిమాలు హిట్, ఫ్లాప్ పై అంత అంచాలు వేసుకోకున్నా. ఇవి వైసీపీకి బాగానే మేలు చేస్తాయని చెప్పడం నిర్వివాదం.