CM YS JAGAN : ఏపీలో వైసీపీ, టీడీపీలు క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నాయి. వీరికి దీటుగా ఎదిగేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తున్నది. అయితే పవన్ కళ్యాణ్ చరిష్మా కేవలం సినిమా వరకే.. రాజకీయాలకు పనిచేయదని గత ఎన్నికల్లో అర్థమైంది. ఈసారి మరింత పుంజుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతున్నారు.
అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టారు పథకాలతో ఆకట్టుకున్నారు. నిజానికి తెలంగాణలో కంటే కూడా ఏపీలో ఎక్కువ సంక్షేమం అమలవుతుందని టాక్ కూడా వచ్చింది. ప్రభుత్వ బడుల బాగు, వలంటీర్ల వ్యవస్థ, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన లాంటి ఎన్నో పథకాలతో ఆకట్టుకున్నారు. సమయానికి పథకాలను అందిస్తూ ప్రజల గుండెల్లో నిలిచారు. లబ్ధిదారు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తూ వలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడుతున్నది. అయితే ద్వితీయ శ్రేణి నాయకుల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినా జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను తీవ్ర ఇబ్బందులు పెడుతూ కేసుల పేరు తో వేధిస్తూ తనకు అడ్డంకులు లేకుండా చేసుకుంటున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా అయినా సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నా ఆయనలో ఎంత మాత్రం టెన్షన్ లేకుండా ఉంటున్నారు. తన వెనుక ప్రజలు ఉన్నారని, తాను ఒక్కడినే దుష్ట చతుష్టయం తో సమరానికి సన్నద్ధమవుతానని స్పష్టంగా చెబుతున్నారు.
అయితే గతంతో పోల్చుకుంటే జగన్ బలం మరింత పెరిగిందని ఏపీ మూడ్ ను బట్టి తెలుస్తున్నది. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా అదే తేల్చింది. రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల్లో జగన్ తన బలం పెంచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు. కొంతమేర అమరావతి రైతులు పోరాటం చేసినా అనుకున్న స్థాయిలో దాని ప్రభావం కనబడలేదు. విభజన హామీలు నెరవేర్చని బిజెపితో అంట కాగుతున్న ప్రజలు దానిపై శ్రద్ధ చూపలేదు మరోవైపు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించి, జే బ్రాండ్ మద్యం తెచ్చి అమ్ముతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నా జగన్ పై అభిమానం తగ్గలేదు. జగన్ కు రాష్ర్టంలో మరింత ఆదరణ పెంచేలా ఐప్యాక్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నది. జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఎప్పటికప్పుడూ వివిధ దారుల్లో ప్రజలకు తెలిసేలా చేస్తున్నది. అయితే రాజకీయ చతురత మెండుగా ఉన్నా చంద్రబాబు ఈ సారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. తన వ్యూహాల్లో తాను ఉన్నారు. మరి ఈ సమయంలో ఆయన స్ర్టాటజీ పనిచేస్తుందా.. ప్రజలు ఏం ఆలోచిస్తుున్నారనేది ఇప్పుడు కీలకం కానుంది.
అయితే రాష్ట్రంలో విద్యా విధానం సంస్కరణల అమలు లో మాత్రం జగన్ ముందు ఉన్నారు. ప్రతి పేదింటి పిల్లడికి నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వ బడులను బాగు చేశారు. అది పిల్లాడిని బడికి రప్పించేలా అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15000 అందిస్తున్నారు. తెలంగాణలో కంటే ఎక్కువ పింఛన్లను ఏపీలోనే అందిస్తున్నారు. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలతో జగన్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. జగన్ తీసుకునే నిర్ణయాలు మధ్య తరగతి, పేద ప్రజలను ఉద్దేశించే ఉండడంతో ఆయనకు మరింత ఆదరణ పెరుగుతున్నది. ఆయన గ్రాఫ్ పెరగడానికి కారణం అవుతున్నది. మరి ఎన్నికల కు మరో ఏడాది ఉండడంతో అప్పటివరకు టైమ్స్ నౌ సర్వే అంచనాలు అలాగే ఉంటాయో లేదో వేచి చూడాలి.
ReplyForward
|