35.3 C
India
Wednesday, May 15, 2024
More

    World Cup 2023 : ఇక వరల్డ్ కప్ ఫీవర్.. ఆ ఐదు రికార్డులు బద్దలయ్యేనా..?

    Date:

    World Cup 2023 :
    ఇక సరిగ్గా వారం రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి ఈ సమరం ప్రారంభం కాబోతున్నది. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ర్టేలియాతో అతిథ్య భారత్ తలపడబోతున్నది. అయితే టీమిండియా లీగ్ దశలో తొమ్మిది జట్లతో తొమ్మిది వేదికలపై తలపడనుంది. ఇక ఇప్పటికే టీమిండియా సిద్ధమైంది. ఆఖరులో సీనియర్ బౌలర్ రవిచంద్రన్  అశ్విన్ జట్టులో చేరాడు. ఇక ఈ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న గుజరాత్ రాష్ర్టంలోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతున్నది. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో బద్దలయ్యే రికార్డులపైనే అందరి దృష్టి ఉంది. బౌలింగ్, రన్స్, వికెట్లు ఇలా అన్ని విభాగాల్లో రికార్డులపైనే దృష్టి ఉంది.
    ఇకే ప్రపంచకప్ లో అత్యధిక రన్స్ చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది,  ఈయన 2003 ప్రపంచకప్ లో 11 మ్యాచులు ఆడి 673 పరుగులు చేశాడు. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ  హేడెన్ 2007లో 659 పరుగులు చేశాడు.

    ఇక అత్యధిక వికెట్లు తీసిన ఘనత  ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్లెన్ మెకగ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 71 వికెట్లతో మొదటిస్థానంలో నిలిచాడు. ఇక తరువాతి జాబితాలో ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, చమిందా వాసులను ఉన్నారు. దీంతో పాటు 2003 ప్రపంచకప్ లో వరుసగా 11 మ్యాచులు గెలిచిన జట్టుగా ఆస్ర్టేలియా ఉంది. రికీ పాంటింగ్ నాయకత్వంలో ఈ ఫీట్ సాధించింది. నాటి ప్రపంచకప్ సిరీస్ ను గెల్చుకుంది.

    మొదటి ప్రపంచకప్ 1975లో జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ జట్టుపై భారత ఆటగాడు సునీల్ గవాస్కర్ 174 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. అత్యంత స్లో ఇన్నింగ్స్ లో ఇది రికార్డుగా నిలిచింది. మొత్తంగా60 ఓవర్ల తర్వాత కూడా నాటౌట్ గా నిలిచాడు. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత క్రిస్ గేల్ పేరిట ఉంది. ఏకంగా 49 సిక్సర్లు కొట్టాడు. ఆ తరువాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్, రికీపాంటింగ్, బ్రెండన్ మెకల్లమ్ ఉన్నారు. మరి ఈ రికార్డులు ఇప్పుడు బద్దలవుతాయా.. అనేది వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...