40.2 C
India
Sunday, May 19, 2024
More

    YCP MLA’s Chanting : వైసీపీ ఎమ్మెల్యేల భజన.. అసెంబ్లీలో జగన్ నవ్వులే నవ్వులు

    Date:

    YCP MLA’s Chanting :

    ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. జనం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ప్రవర్తించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎలాగూ సభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేకుండా బయటకు పంపించారు. ఇంకేం మాకెవరు అడ్డు అన్నట్లుగా ప్రవర్తించడం జనాన్ని విస్మయానికి గురిచేసింది. సభ నడస్తున్నంత సేపు సీఎం జగన్ భజనకే మంత్రులు, ఎమ్మెల్యేలు పరిమితమయ్యారు.

    రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధిపై అసలైన చర్చ లేకుండానే అసెంబ్లీ సమావేశాలను కానిచ్చేశారు. ఎంతసేపు మా జగన్ ఇది.. అది అంటూ పొగడ్తల వర్షానికే పరిమితమయ్యారు. ఇంతకీ జనానికి చేసిన మేలు ఏంటో మాత్రం చెప్పనే లేదు. గతంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని అభివృద్ధి, సంక్షేమాని మా ముఖ్యమంత్రి చేసి చూపించారని గొప్పలు చెప్పుకోవడానికి పూర్తి సమయాన్ని కానిచ్చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలపై మాత్రం విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు.  వారు సభలో లేరనే కనీస మర్యాద లేకుండా విమర్శలు చేశారు. ఎంతసేపు గత ప్రభుత్వంపై మాత్రమే విమర్శలు చేయడానికే సమయం కేటాయించారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి తామేమీ వెలగబెట్టామో మాత్రం చెప్పుకోలేకపోయారు.

    ఇక తమ సభ్యుల పొగడ్తలతో సీఎం జగన్ మాత్రం ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభ నడుస్తున్నంతసేపు, ప్రతిపక్ష నేత పై విమర్శలు, తనపై పొగడ్తలు వింటూ నవ్వుతూ ఉన్నారు. సభలో లేని వ్యక్తిపై ఇలా మాట్లాడడం సరికాదని కూడా సీఎం హోదాలో చెప్పలేకపోయారు. ఇక్కడికే తనకు ఆనందం అన్నట్లుగా వెకిలి నవ్వులు నవ్వుతూ వికట్టహాసం చేసినట్లుగా ప్రవర్తించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించడం మొదటిసారిగా చూస్తున్నామని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఆరు నెలలు ఇలాగే నవ్వుకోని అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ కు అధికారం ఉండేది ఈ ఆరు నెలలు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...