33.3 C
India
Thursday, May 16, 2024
More

    AZADI KA AMRIT MAHOTSAV:దేశమంతటా మువ్వన్నెల రెపరెపలు

    Date:

    భారతదేశమంతటా మువ్వన్నెల రెపరెపలతో శోభాయమానంగా వెలిగిపోతోంది. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్ళు కావడంతో త్యాగధనులను స్మరించుకుంటూ మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేస్తున్నారు భారతీయులు. భారతదేశ స్వాతంత్య్రం కోసం లక్షలాది మంది నాయకులు తమ జీవితాలను త్యాగం చేసి పోరాటం చేసారు. అయితే అందులో కొంతమంది కీలక మహనీయుల గురించి క్లుప్తంగా చూద్దాం.

    1) మహాత్మా గాంధీ : అహింసా మార్గంలోనే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తుందని గట్టిగా నమ్మడమే కాకుండా అహింసామార్గాన్ని ఆచరించి చూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ. దేశాన్ని అంతటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి స్వతంత్య్ర సంగ్రామంలో పాల్గొనేలా చేసిన మహనీయుడు.

    2) సుభాష్ చంద్రబోస్ : గాంధీజీ సింద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా హింసా మార్గంలోనే భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని నమ్మడమే కాకుండా భారత్ కోసం ఏకంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ని స్థాపించి పోరాటం సాగించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పోరాటయోధుడు సుభాష్ చంద్రబోస్.

    3) సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ : భారతదేశం పలు రాజ్యాల సమూహం. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ లోని 545 కు పైగా సంస్థానాలను దేశంలో విలీనం చేసి భారత్ ను బలీయమైన శక్తిగా మార్చిన ధీశాలి.

    4) జవహర్ లాల్ నెహ్రూ : స్వతంత్య్ర భారతానికి మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ . స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నెహ్రూ తన ఏలుబడిలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

    5) భగత్ సింగ్ : బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పెట్టించిన విప్లవ వీరుడు భగత్ సింగ్. స్వతంత్య్ర భారతం కోసం విప్లవ పంథాను ఎంచుకొని హత్య గావించబడ్డాడు.

    6) ఝాన్సీ లక్ష్మీభాయ్ : స్వతంత్య్ర పోరాటంలో ఎందరో మహానుభావులు , అయితే ఒక మహిళ అయి ఉండి అసాధారణ సైన్యం కలిగిన బ్రిటిష్ పాలకులను ఎదురించి పోరాడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీభాయ్.

    7) అల్లూరి సీతారామరాజు : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవమార్గాన్ని ఎంచుకొని బ్రిటీష్ పాలకులకు చుక్కలు చూపించిన ధీశాలి. బ్రిటీష్ వారిని ఎదురించి ప్రాణాలను అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి.

    8) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ : స్వాతంత్య సంగ్రామంలో పాల్గొన్న బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు. భావి తరాల కోసం రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు.

    Share post:

    More like this
    Related

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Fair Politics : హుందాతో కూడిన రాజకీయం అంటే ఇలా ఉంటుంది..

    Fair Politics : పార్టీలు వేరైనా ఇలాంటి హుం దా కలిగిన...

    PM Modi : అభివృద్ధిలో రేవంత్‌కు పూర్తి సహకారం.. రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

    PM Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని...