రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కి పడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప పర్యటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రాకతో రామప్పలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రామప్ప విశిష్టత తెలిపేలా భారీ ఎల్ ఈ డీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎల్ ఈ డీ స్క్రీన్ ల దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. స్క్రీన్ ల నుండి పొగలు రావడం వెంటనే మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప దేవాలయాన్ని మొత్తం కలియ తిరిగి చూడటం విశేషం . అలాగే రామప్ప చరిత్ర అడిగి మరీ తెలుసుకున్నారు. ద్రౌపది ముర్ము రాకతో ప్రజలు ఆమెను చూడటానికి తరలివచ్చారు. అయితే ప్రజలను రామప్ప లోకి అనుమతి ఇవ్వలేదు అధికారులు.