Droupadi Murmu : మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు సాధించిన ప్రగతిని బట్టే సమాజ పురోగతి ఎంటో తెలుస్తుందని రాష్ట్ర పతి అన్నారు.
భారతదేశం ఆడ బిడ్డలు క్రీడల నుంచి సైన్స్ వరకు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. దేశం గర్వించేలా చేస్తున్నారనీ మర్ము తెలిపారు. వారికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి మనం కలిసి పనిచేద్దాం అని రాష్ట్ర పతి మిర్ము తెలిపారు. మహిళలు రేపటి భారత దేశాన్ని రూపొందిస్తారనీ ఆమె తెలిపారు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పతి ద్రౌపతి ముర్మ మహిళల కోసం ఇలా తన సందేశాన్ని అందించారు. మహిళలు చెయ్య లేని పని అంటూ ఏమి లేదని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు మహిళలలు వంట ఇంటికే పరిమితం అయ్యే వారని నేడు మహిళా శక్తి ఎంటో ప్రపంచా నికి చాటి చెబుతున్నారని ఆమె తెలిపారు.