భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రామప్ప , భద్రాద్రి లలో పర్యటించనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ చేపట్టిన పథకం కింద రామప్ప లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. అందులో భాగంగానే పర్యాటక శాఖ చేపట్టిన అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. దాంతో రామప్ప పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. రామప్పలో ఈరోజు ఎలాంటి పర్యాటకులను అనుమతించడం లేదు.
అలాగే భద్రాద్రి లో సీతారాములను దర్శించుకోనున్నారు ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి పర్యటనతో ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్రపతికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం , రామప్పలోని శివుడిని , భద్రాచల సీతారాముల వారిని దర్శించుకొని మళ్ళీ హైదరాబాద్ చేరుకోనున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది.