వరదలతో అతలాకుతలం అవుతోంది యావత్ భారతం. ఆసేతు హిమాచలం వరణుడి చేష్టలతో చిగురుటాకులా వణికిపోతోంది. వరదలు అన్ని రాష్ట్రాలను భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో నగరాలతో పాటుగా ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అయితే వరదలతో వణికిపోతున్నాయి.
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మహారాష్ట్ర , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. దాంతో పోలవరం దగ్గర కూడా ప్రమాద ఘంటికలు మ్రోగాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను నాటు పడవలతో తరలించారు.
Breaking News