Hong Kong : ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నారో సినీ కవి. మనం ఖండాలు దాటినా మన ఖ్యాతిని మరిచిపోకూడదు. ఎల్లలు దాటినా మన హద్దులు మరిచిపోకూడదు. ఎన్ని దేశాలు దాటినా మనదేశం గొప్పతనమే మనకు గర్వకారణం. దీనికి అందరు కంకణబద్ధులై నిలుస్తున్నారు. తానా అయితేనేమీ హాంకాంగ్ సమాఖ్య అయినా గానీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేయడమే వారి లక్ష్యం.
తాజాగా హాంకాంగ్ లో ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య పదో వార్షికోత్సవం నిర్వహించారు. ఇందులో అనేక విషయాలు ప్రస్తావించారు. తెలుగు వారి కీర్తిని కొనియాడారు. మన దేశ ఔన్నత్యాన్ని పొగిడారు. మన దేశ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను శ్లాఘించారు. మన దేశ వ్యవస్థ మీద వారికున్న ప్రేమ చూస్తుంటే భారతీయులు ఎక్కడున్నా కన్నభూమిని మాత్రం మరిచిపోవడం లేదని తెలుస్తోంది.
తెలుగు భాష ఔన్నత్యాన్ని దశదిశలా చాడటంలో మనకు మనమే సాటి. మనకు మనమే పోటీ. అదే తెలుగు వారి గొప్పతనం. సామాన్యుల నుంచి నాయకుల వరకు తెలుగు భాష కీర్తిని పెంచుతున్నారు. కవితలు, నాటికలు, పద్యాల రూపంలో తెలుగు భాషను బతికిస్తూనే ఉన్నారు. తెలుగు వారిగా పుట్టడం మా జన్మ ధన్యమైందని అంటున్నారు.
తెలుగు భాష మనది నిండుగ వెలుగు భాష మనది అంటూ పాడుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ కౌన్సిల్ కె. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేయడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. తెలుగు వారి కీర్తిని చాటాలని నిర్ణయించుకున్నారు. ప్రతిభను ఇతరులకు పంచడమే తమ ఉద్దేశమని చెప్పారు.