29.5 C
India
Sunday, May 19, 2024
More

    పచ్చి బఠాణీలో ఎన్ని పోషకాలున్నాయో తెలుసా?

    Date:

    మన ఆరోగ్య సంరక్షణకు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం మన ఆహార శైలి అదుపు తప్పుతోంది. అందుకే రోగాలు చుట్టుముడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, అల్సర్, థైరాయిడ్, గుండె జబ్బులు మనుషులను భయపెడుతున్నాయి. అయినా మనలో మార్పు రావడం లేదు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మనం తినే ఆహారమే ప్రతిబంధకంగా మారుతుందని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనుగడ ఉంటుంది. లేదంటే టపా కట్టేయడమే.

    మనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. అందులో పచ్చి బఠాణీ ఒకటి. వీటిని తినడం వల్ల పోషకాలు మెండుగా అందుతాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు మన శరీరానికి అండగా నిలుస్తాయి. మన ఆరోగ్యాన్ని పది కాలాల పాట కాపాడే శక్తి వీటిలో ఉంటుంది. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

    పచ్చి బఠాణీలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా పొటాషియం, జింకు ఉండటం వల్ల కూరకు రుచి తెస్తాయి. వీటిని తినడం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి మంచి లాభాలు ఇస్తాయి.

    ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల చర్మానికి ఎన్నో పోషకాలు ఇస్తాయి. వారంలో కనీసం మూడు సార్లు తింటే పలు రకాల రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. షుగర్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి. ఈ నేపథ్యంలో పచ్చి బఠాణీలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనుకూల ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...

    Sexual Performance : లైంగిక సామర్థ్యం పెంచే కూరగాయలు ఏంటో తెలుసా?

    Sexual Performance : ఇటీవల కాలంలో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీంతో...