
Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని కొందరు అంటారు. మరికొందరేమో పాలు తాగడం వల్ల గుండె సంబంధిత రోగాలు వస్తాయని చెబుతుంటారు. ఇందులో ఏది నిజం? వాస్తవాలేంటి? ఎందుకు పాలు తాగితే గుండెకు నష్టమా? ఇందులో ఏముంటుంది. ఎందుకు పాలు తాగొద్దంటున్నారు. పాల వల్ల కొలెస్ట్రాల్ ఏర్పడుతుందని అంటున్నారు. దీని వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందని భావిస్తున్నారు.
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్ డీఎల్, మంచి కొలెస్ట్రాల్ హెచ్ డీఎల్ రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన గుండెకు రక్త సరఫరా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ మనకు చేటు చేసేదే. అందుకే మనకు గుడ్ కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఇబ్బంది కలిగిస్తుంది. పాలు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతందనేది అపోహే. పాలు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
పాలు తాగే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 14 శాతం తగ్గుతాయని చెబుతారు. పాలు తాగడం వల్ల బరువు తగ్గే సూచనలు ఉంటాయట. 250 ఎంఎల్ పాలలో 8 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఇందులో కాల్షియం, విటమిన్ ఎ, బి12, పాస్పరస్, పొటాషియం, మెగ్నిషియం, జింక్, అయోడిన్ వంటి పోషకాలు మెండుగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు, ఎముకలు విరిగిపోవడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
రోజు ఓ గ్లాసు పాలు తాగాలి. వారానికి 4,5 గుడ్లు తినాలి. వారానికి రెండు సార్లు చికెన్ లేదా మటన్ తింటే మంచిదే. ఫ్రైలు కాకుండా పులుసు పె ట్టుకుని తింటే ఎలాంటి నష్టాలు రావు. ఇలా మనం తీసుకునే ఆహారాల్లో పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే పాలను తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ చెడు మాత్రం చేయవని తెలుసుకోవాలి.