Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది. బాల్యం దశలో అందే పోషకాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. పిల్లల బరువు, ఎత్తు కీలకంగా ఉంటాయి. ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోతే సమస్యలు వస్తాయి. పోషకాహార లోపం పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, జీవనశైలి కారణంగా పిల్లల్లో ఎదుగుదల కనిపించడం లేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 ప్రకారం నివేదిక ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు 149 మిలియన్ల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల లోపు వయసున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్ కేటగిరీలో నమోదయ్యారు. పిల్లల జీవితంలో పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. ఎముకల ఆరోగ్యం బాగా లేకపోతే కండరాల శక్తి లోపం కనిపిస్తుంది.
పిల్లలకు ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు, కొవ్వులతో పాటు కాల్షియం, విటమిన్ డి, కె, అర్టినిన్ వంటి సూక్ష్మ పోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రో న్యూట్రియెంట్లు అవసరం ఉంటాయి. పిల్లల ఎదుగుదలలో పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. దీంతో వారి ఎదుగుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
పిల్లల ఎదుగుదలకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ కీలకంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, జింక్ వంటి 50 శాతం పోషకాలు పిల్లలకు ఆహారం నుంచి లభిస్తాయి. పోషకాహార సప్లిమెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు ఖనిజాల శోషణ మెరుగుపరుస్తాయి. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8 శాతం మంది పిల్లలు ఉన్నారని చెబుతున్నారు.
కూరగాయలు, పండ్లు, ప్రొటీన్లు, పాలు అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల ఆరోగ్యంలో తిండి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో పోషకాహారం తీసుకుని పిల్లల ఎదుగుదలకు బాటలు వేసుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు పిల్లల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.