28.5 C
India
Sunday, May 19, 2024
More

    చికెన్ అపరిమితంగా తింటే అనర్థాలే తెలుసా?

    Date:

    chicken dangers
    chicken dangers

    మనలో చాలా మంది మాంసాహారులే. దీంతో జిహ్వ చాపల్యం చంపుకోలేక మాంసాహారాన్ని తీసుకుంటారు. రుచికి బాగానే ఉంటుంది కానీ ఆరోగ్య రీత్యా ఇబ్బందులొస్తాయి. ఏదైనా మితంగా తీసుకుంటే ఓకే కానీ పరిమాణం పెరిగితే ప్రమాదమే. దీంతో మాంసాహారం తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. మితిమీరిన పరిమాణంలో తీసుకుంటే జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది.

    అధిక బరువు

    చికెన్ ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు పెరుగుతుంటారు. ఇందులో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు మనకు బలాన్ని ఇస్తాయి. కొందరు ప్రతిరోజు చికెన్ తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇది డేంజర్. ఏదైనా రోజు తింటే బోరు కొడుతుంది. పైగా దాని వల్ల అనర్థాలు వస్తాయి. కానీ చికెన్ ప్రియులు ఈ విషయాన్ని తెలుసుకుని వారంలో ఒకసారి తినేందుకు మొగ్గు చూపితే సరి.

    కొలెస్ట్రాల్

    చికెన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది మంచి కొవ్వు కాదు. చెడు కొవ్వు. ఇది మన శరీరంలో పేరుకుపోతే గుండె పోటు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో చికెన్ పరిమితంగానే తినాలి. అపరిమితంగా తింటే కష్టాలు వస్తాయి. కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బులు ఇబ్బంది పెడతాయి. అందుకే చికెన్ ప్రియులు తెలుసుకుని మితంగా తీసుకోవడమే ఉత్తమం.

    అధిక వేడి

    చికెన్ శరీరంలో వేడిని పెంచుతుంది. వేసవి కాలంలో వేడిగానే ఉంటుంది. చికెన్ తింటే మనశరీరంలో ఉష్ణోగ్రత అధికమవుతుంది. వేసవికాలంలో చికెన్ తినకపోవడమే మంచిది. అంతేకాని చికెన్ ఎక్కువగా తినడం వల్ల అల్సర్, క్యాన్సర్ వంటి వాటికి దగ్గరయ్యే వీలుంటుంది. వేసవిలో చికెన్ తీసుకోకపోతేనే మంచి లాభాలుంటాయి. ఇది అందరు గుర్తుంచుకోవాలి.

    ఇతర నష్టాలు

    చికెన్ తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశముంటుంది. రోజు చికెన్ తింటే హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మహిళల్లో థైరాయిడ్ సమస్య రావచ్చు. శరీర బరువు కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. చికెన్ తినడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఇలా చికెన్ అధికంగా తినడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. చికెన్ ప్రియులు తస్మాత్ జాగ్రత్త. చికెన్ మితంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Food shortage : అన్నమో రామచంద్రా!

    -25 శాతం తగ్గిన సాగు: తాగు సాగు నీటి ఎద్దడి: నిత్యవసరాలకు...

    Nutrition Food For Women : ఏ వయసు మహిళలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

    Nutrition Food For Women : మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని...

    Healthy food : ఆరోగ్యం బాగుండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలి?

    Healthy food : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాలు ప్రధానం....