అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కష్టాలు వచ్చి పడ్డాయి. ట్రంప్ ఫామ్ హౌజ్ లో FBI అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబందించిన రహస్య పత్రాలను ట్రంప్ ఎందుకు తన ఫామ్ హౌజ్ లో దాచుకున్నాడు అన్నది మిస్టరీగా మారింది. దాంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో ట్రంప్ ఫామ్ హౌజ్ లో సోదాలు నిర్వహించడమే కాకుండా రహస్య పత్రాలను ఎందుకు ఇక్కడ దాచి పెట్టారు అని ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే నేను అమెరికా మాజీ అధ్యక్షుడిని . అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యకిని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదని ట్రంప్ ఎదురు ప్రశ్నించడంతో కావాలనే ఇలాంటి పని చేసాడని , FBI అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సింది పోయి నన్ను ప్రశ్నించే అధికారం మీకు లేదని వాదనకు దిగడం అంటే ట్రంప్ తప్పు చేసినట్లు స్పష్టం అవుతోందని భావిస్తున్నారు అధికారులు. పెద్ద మొత్తంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో రానున్న రోజుల్లో ట్రంప్ కు మరిన్ని కష్టాలు రావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.