ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తి , అబద్ధాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసే వ్యక్తి చేతుల్లోకి వెళ్ళింది. దానికి ఎడిటర్ అంటూ ఎవరూ లేని పరిస్థితి. అలాంటి ట్విట్టర్ నుండి ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ ట్విట్టర్ పై అలాగే ఎలాన్ మస్క్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ట్విట్టర్ తో సఖ్యత లేకపోవడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
దాంతో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ని శాశ్వతంగా తొలగించారు. కట్ చేస్తే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడంతో ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. ఇక ఇప్పుడేమో జో బైడెన్ ట్విట్టర్ పై ఎలాన్ మస్క్ పై ఆగ్రహంగా ఉన్నారు. ట్విట్టర్ అబద్ధాలను , అసత్యాలను ప్రచారం చేస్తుందని జో బైడెన్ భావిస్తున్నారు. అందుకే ఆగ్రహంగా ఉన్నారు.