Pawan టీడీపీకి జనసేన బీ టీం అంటూ వైసిపీ నాయకులు తరచూ కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయమై జనసేనని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏలూరు సభలో వాలంటీర్ల వ్యవస్థ మీద అనుమానాలు వ్యక్తం చేసిన జనసేనాని, రాష్ట్రవ్యాప్తంగా సంచలనాల కి కేంద్ర బిందువయ్యాడు. మరోసారి తాడేపల్లిగూడెంలో జరిగిన సభలోనూ పవన్ అదే స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అయితే తాజాగా పార్టీ నేతల సమావేశంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. జనసేన ను టిడిపీకి బీటీం అంటూ వైసీపీ నేతలు ప్రస్తావించడాన్ని ఈ సందర్భంగా ఆయన లేవనెత్తారు. వైసీపీని మర్డర్ టీమ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ అనుకోవడంలో తప్పులేదు..కానీ జనసేనలోని కొందరు నేతలు బీ టీం అంటూ అనుమానాలు పెట్టుకోవడం సరికాదని ఆయన సూచించారు. వైసీపీ నేతలు ఇంతగా జనసేన టార్గెట్ చేస్తున్నారంటే మన బలం ఏంటో గుర్తించాలని శ్రేణులకు ఆయన హితవు పలికారు.
వైసీపీ పై చేస్తున్న పోరాటంలో తనకు నిజాయితీ ఉందని, ఎవరి కోసమో తాను పోరాటం చేయడం లేదని చెప్పుకొచ్చారు. అయితే కనిపించే శత్రువుతో పోరాటం చేయవచ్చునని కానీ కనిపించని శత్రువుతో చేయలేమని అన్నారు. పార్టీలో ఉండి విమర్శలు చేయడం తగదని తెలిపారు ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని, లేదంటే బయట ఉండి మాట్లాడాలని పార్టీలో కాదని చెప్పుకొచ్చారు. అయితే విజయవాడలో పవన్ పై కేసు నమోదు చేయడంపై జనసేన శ్రేణులు మండిపడ్డాయి. ఈ సందర్భంగా ఆందోళనకు దిగాయి. వలంటీర్ల వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు వేడి మరికొన్ని రోజులైనా తగ్గేలా లేదు.