33.3 C
India
Thursday, May 16, 2024
More

    తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌ని ష‌ర్మిల‌..!?  

    Date:

    sharmila
    sharmila

    కొంద‌రు రాజ‌కీయాలు ఎందుకు చేస్తుస్తారో అర్థం కాని ప‌రిస్థితి. స‌ద‌రు వ్య‌క్తులు ఏ ఉద్దేశ్యంతో రాజ‌కీయ పార్టీలు పెడుతారో తెల్వ‌ని సిచ్యుయేష‌న్‌. వైఎస్ఆర్టీపీ అధినేత్రి ష‌ర్మిల‌ది కూడా ఇలాంటి ప‌రిస్థితే. ఆమె ఎందుకు తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ స్థాపించారో అర్థం కావ‌డం లేదు. ష‌ర్మిల ఏం చేద్దామ‌ని ఇక్క‌డ పాలిటిక్స్ చేస్తున్నారో తెలియ‌డం లేదు.

    దివంగ‌త సీఎం వైఎస్ఆర్ కూతురుగా మాత్ర‌మే ష‌ర్మిల‌కు పేరుంది. అంత‌కు మించి ఆమెకున్న ప్ర‌త్యేకమైన‌ అర్హ‌త‌లేమి లేవ‌నే చెప్పాలి. ష‌ర్మిల రాజ‌కీయాల్లో ప‌బ్లిక్ కోసం చేసిన ఘ‌న కార్యాలు కూడా పెద్దగా ఏమీ లేవు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన‌న్ని రోజులు తెలంగాణ ఉద్య‌మ ఊసే ఎత్త‌నీయ‌లేదు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం రాజ‌కీయాలు చేసే ఇక్క‌డి నేత‌ల‌ను అధః పాతానికి తొక్కేశారు.

    అలాంటిది ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరుతో ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్టి రాజ‌కీయాలు చేయ‌డం విడ్డూరంగా ఉంది. వైఎస్ఆర్ బ‌తికున్నన్ని రోజులు తెలంగాణ కుత్తుక మీద క‌త్తి పెట్టి నాయ‌కుడు. ఆయ‌న చేసిన ఘ‌న కార్యాల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇప్ప‌టికి మ‌ర‌చిపోలేక‌పోతున్నారు. ఇక ష‌ర్మిల సోద‌రుడు,ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మానుకోట ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మ‌కారులు ఆయ‌నకు , ఆయ‌నకు మ‌ద్ద‌తునిస్తున్న నాయ‌కుల‌కు ఏలా బుద్ధి చెప్పారో తెలిసిన విష‌యం. అయితే ప‌బ్లిక్ ఇవ‌న్ని విష‌యాలు మ‌ర‌చిపోక ముందే ష‌ర్మిల ఇప్పుడు పాద‌యాత్ర, దీక్ష‌ల పేరుతో తెలంగాణ గ‌ట్టుపై రాజ‌కీయాలు చేయ‌డం అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తోంది.

    తెలంగాణ అభివృద్ధి కోసం ఒక స్ప‌ష్ట‌మైన విధాన‌మంటు లేని పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ. ఆ పార్టీకి అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల‌కు తెలంగాణ భౌగోళిక‌,రాజ‌కీయ‌,నైస‌ర్గిక స్థితిగ‌తుల‌పై అస‌లే అవ‌గాహ‌న లేదు. ఆమె చేస్తున్న కార్య‌క్ర‌మాలు, పాద‌యాత్ర‌ల‌కు ప‌బ్లిక్ నుంచి పెద్ద‌గా మ‌ద్ద‌తు కూడా దొర‌క‌డం లేదు. ఇదే ఇప్పుడు ష‌ర్మిల‌లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

    ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం ష‌ర్మిల చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.  సోమ‌వారం ఆమె లోట‌స్ పాండ్ నుంచి సిట్‌ కార్యాల‌యానికి వెళ్లేందుకు య‌త్నించారు. దీంతో ష‌ర్మిలను ఎక్క‌డికి వెళ్లొద్ద‌ని పోలీసులు సూచించారు. అయితే వారి మాట వినిపించుకోని ఆమె బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. దీంతో అక్క‌డే ఉన్న ఓ మ‌హిళా కానిస్టేబుల్ చెంప చెళ్లుమ‌నిపించారు. ఆమెకు అడ్డుత‌గుతున్నా ర‌ని మ‌రో ఎస్ఐని కొట్టారు. దీంతో ఆగ్ర‌హించిన పోలీసులు ష‌ర్మిల‌ను అదుపులోకి తీసుకోని రిమాండ్ కు త‌ర‌లించాల్సిన సిచ్యుయేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. అయితే బాధ్య‌త గ‌ల్గిన రాజ‌కీయ పార్టీకి అధ్య‌క్షురాలుగా ఉన్న‌ ష‌ర్మిల ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఆమె తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌ని అంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు.

    Share post:

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...