గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన రాజా సింగ్ 2018 లో జరిగిన ఎన్నికల్లో ఒక్కడే గెలిచి చరిత్ర సృష్టించాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినప్పటికీ తెలంగాణ లో ఎక్కడ కూడా డిపాజిట్ లు కూడా దక్కలేదు. కానీ అలాంటి సమయంలో గోషామహల్ లో ఏక్ నిరంజన్ లా గెలిచి సత్తా చాటాడు.
అయితే రాజా సింగ్ మొదటి నుండి కూడా దూకుడు మనస్తత్వం కలిగిన వ్యక్తి కావడంతో బీజేపీ లోని మిగతా నాయకులకు రాజా సింగ్ కు అంతగా పొసిగేది కాదు. అలాగే తరచుగా ఒవైసీ బ్రదర్స్ కు గట్టి కౌంటర్ లు ఇస్తుంటాడు కూడా. అయితే తాజాగా మునావర్ హైదరాబాద్ పర్యటించడంతో రాముడి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మహమ్మద్ ప్రవక్త పై అలాగే ఆ మతం పై విరుచుకుపడ్డాడు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అంతటా ఎం ఐ ఎం తీవ్ర ఆందోళనకు దిగడంతో బీజేపీ నాయకత్వం స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మిమ్మల్ని ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయద్దో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. దాంతో షాక్ అవ్వడం రాజాసింగ్ వంతు అయ్యింది. తనకు మద్దతుగా పార్టీ నిలుస్తుందని అనుకుంటే తనకే షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట రాజాసింగ్.