ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి , వి. హనుమంతరావు, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి , మధు యాష్కీ తదితర అసమ్మతి నేతలు ఈరోజు జరిగిన కాంగ్రెస్ శిక్షణా తరగతులకు డుమ్మా కొట్టారు. ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేసి చెప్పినప్పటికీ భట్టి విక్రమార్క , కోదండరెడ్డి లాంటి అసమ్మతి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , జగ్గారెడ్డి, మధు యాష్కీ , సుధీర్ బాబు , హనుమంతరావు, మహేశ్వర్ రెడ్డి లాంటి నేతలు మాత్రం హాజరు కాలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఇంకా సద్దుమనగలేదని మరోసారి నిరూపితమైంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు చర్చలు జరిపినప్పటికి ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Breaking News