నా రక్తం , నా కిడ్నీ , నా బొచ్చు ఏది ఇవ్వమంటే అది ఇస్తాను …… నేను డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువు కాకపోతే కరీం నగర్ కమాన్ లో నీ చెప్పుతో కొట్టుకుంటావా బండి సంజయ్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించాడు మంత్రి కేటీఆర్. ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించాడు మంత్రి కేటీఆర్. ఆ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్ బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేసాడు.
డ్రగ్స్ కేసులో పదేపదే నాపేరు వల్లెవేస్తున్నావ్ కదా ! టెస్ట్ ల కోసం నా రక్తం , కిడ్నీ , నా బొచ్చు ఏది కావాలంటే అది ఇస్తాను తీసుకోండి. ఏ డాక్టర్ ను తీసుకొస్తావో తీసుకునిరా …… నేను ఇక్కడే ఉంటా …… ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిజం తేలకపోతే కరీం నగర్ చౌరస్తాలో చెప్పుతో కొట్టుకుంటావా ? అంటూ ప్రశ్నించాడు.
బండి సంజయ్ కరీం నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇక రాబోయేది లాస్ట్ బడ్జెట్. ఇప్పటి వరకు కరీం నగర్ కు ఏం చేసావో చెప్పు. పార్లమెంట్ కు వెళ్ళు …… హిందీలో మాట్లాడు హిందీ రాకపోతే ఇంగ్లిష్ లో మాట్లాడు కానీ కరీం నగర్ కు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకురా అంటూ తీవ్ర పరుష పదజాలంతో దూషించాడు కేటీఆర్.