జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి తెలంగాణ RTA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెప్పిన మార్పులకు ఒప్పుకోవడంతో వారాహి రిజిస్ట్రేషన్ అయిపొయింది. అంతేకాదు వారాహి ప్రచార రథానికి ” TS 13 EX 8384 ” అనే నెంబర్ ను కూడా అలాట్ చేసారు. దాంతో రిజిస్ట్రేషన్ తంతు పూర్తయినట్లే ! కాకపోతే ఇంతకుముందు వారాహి వాహనం కలర్ ” ఆలివ్ గ్రీన్ ” కాగా ఇప్పుడు ” ఎమరాల్డ్ గ్రీన్ ” గా మారింది. అంటే స్వల్ప మార్పు మాత్రమే !
ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహిని ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అధునాతనమైన హంగులతో వారాహి వాహనాన్ని రూపొందించుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే వారాహి వాహనం కలర్ పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇక వైసీపీ శ్రేణులు అయితే పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేసారు.
RTA అధికారుల సూచనతో ఆలివ్ గ్రీన్ ను కాస్త ఎమరాల్డ్ గ్రీన్ గ మార్చారు. మిగతావి కూడా నిబంధనల ప్రకారం ఉండటంతో వారాహి రిజిస్ట్రేషన్ తెలంగాణలో విజయవంతం అయ్యింది దాంతో పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసైనికులు కూడా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2023 లో శాసనసభకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.