29.5 C
India
Sunday, May 19, 2024
More

    హ్యాపీ బర్త్ డే నటసింహం.. బాలయ్య గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

    Date:

     

    నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు చెబితే చాలు పూనకాలు వచ్చిన వారిలా ఊగిపోతుంటారు ఫ్యాన్స్.. నందమూరి ఫ్యాన్స్ ఈయన సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు.. సినిమాల్లో ఈయన చెప్పే మాస్ డైలాగ్స్, తొడగొట్టే సన్నివేశాలకు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం ఫ్యాన్స్ పని.. మరి అలాంటి బాలయ్య ఈ రోజు తన పుట్టిన రోజును జరుపు కుంటున్నారు అంటే ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అనే చెప్పాలి.

    సోషల్ మీడియాలో ఈయన బర్త్ డే సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది.. అలాగే ఆఫ్ లైన్ లో కూడా ఫ్యాన్స్ బాలయ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా బాలయ్య లైఫ్ లో కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తాతమ్మ కల అనే సినిమాతో బాలయ్య తెరంగేట్రం చేయగా ఇప్పుడు తన కెరీర్ లో 108వ సినిమాను చేస్తున్నాడు.

    ఈయన ఏకంగా 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ లో పోషించారు.. మరో హీరో ఎవరు కూడా ఇన్ని సినిమాలలో డ్యూయెల్ రోల్ పోషించలేదు.. ఇక బాలయ్య అలవోకగా డైలాగ్స్ చెప్పే సామర్థ్యం కలిగి ఉన్నాడు. పౌరాణికం, సైన్స్ ఫిక్షన్, జానపదం, సాంఘికం వంటి జోనర్ లలో నటించిన బాలయ్యకు గోన గన్నారెడ్డి, చెంఘీజ్ ఖాన్ పాత్రలో నటించాలి అన్నది చిరకాల కోరిక అని తెలుస్తుంది.

    అలాగే బాలయ్య నటించిన సినిమాలు 1987లో ఒకే ఏడాదిలో 8 రిలీజ్ కాగా అన్ని కూడా మంచి హిట్ సాధించాయి.. బాలయ్య అత్యధికంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 13 సినిమాలు చేసాడు. లక్ష్మి నరసింహస్వామి అంటే అమితమైన ఇష్టం కలిగిన బాలయ్య సింహ అనే పేరు కలిసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.

    43వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు టాలీవుడ్ తరపున వెళ్లిన నటుడు బాలయ్య.. బాలయ్య ముందు ముందు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈయన నటించిన ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమాను తెరకెక్కించనున్నారు.

    నటన మాత్రమే కాదు సింగింగ్ తో కూడా బాలయ్య సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇక ప్రస్తుతం అనిల్ దర్శకత్వంలో భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నటుడిగా, సింగర్ గా, త్వరలోనే దర్శకుడిగా మారనున్న బాలయ్య పొలిటీషియన్ గా కూడా ప్రజలకు ఎన్నో మంచి పనులను చేస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samarasimha Reddy : మార్చి 2న సమరసింహారెడ్డి మళ్లీ విడుదల

    Samarasimha Reddy Re Release : బాలక్రిష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో...

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి....

    Chiranjeevi Balakrishna : బాలకృష్ణ కంటే చిరు మార్కెట్ ఎక్కువ! ఎందుకో తెలుసా?

    Chiranjeevi Balakrishna : 80's నుంచి ప్రజెంట్ యంగ్ జనరేషన్ వరకు...