29.5 C
India
Sunday, May 19, 2024
More

    దసరా రివ్యూ

    Date:

    nani dasara movie review
    nani dasara movie review

    నటీనటులు : నాని , కీర్తి సురేష్
    సంగీతం : సంతోష్  నారాయణ్
    నిర్మాత : సుధాకర్ చెరుకూరి
    దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
    రేటింగ్ : 3/5
    రిలీజ్ డేట్ : 30 మార్చి 2023

    నాని – కీర్తి సురేష్ లది సూపర్ హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. కాగా ఆ కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ” దసరా ”. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.శ్రీరామ నవమి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది దసరా. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ :

    1990 బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఓ మారుమూల గ్రామమైన వీర్లపల్లి లో ధరణి ( నాని ) , వెన్నెల ( కీర్తి సురేష్ ) , సూరి ( దీక్షిత్ శెట్టి ) లో నివసిస్తుంటారు. ఈ ముగ్గురు కూడా చిన్ననాటి స్నేహితులు. ధరణికి వెన్నెల అంటే ఇష్టం. అయితే సూరి కూడా వెన్నెలను ప్రేమిస్తుంటాడు. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమిస్తుండటంతో వాళ్ళ మధ్య చిచ్చు ఎలా పెట్టారు ? గ్రామీణ రాజకీయాలు ఎలాంటి పాత్రను పోషించాయి. బొగ్గు గని వ్యవహారం ఎలాంటి మలుపులు తిప్పింది ? చివరకు ధరణి – వెన్నెల ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    హైలెట్స్ :

    నాని
    కీర్తి సురేష్
    బ్యాక్ డ్రాప్
    నేపథ్య సంగీతం
    విజువల్స్
    దర్శకత్వం

    డ్రాబ్యాక్ :

    స్లో నరేషన్

    నటీనటుల ప్రతిభ :

    నాని అనగానే పక్కింటి అబ్బాయి అనే ట్యాగ్ లైన్ ఉండనే ఉంది. అలాంటి నాని పూర్తిగా తనని తాను మలుచుకున్న తీరుకు ఇప్పటికే ప్రేక్షకులు ఫిదా అయ్యారు లుక్ , టీజర్ తో. ఆ ఇంప్రెషన్ ను ఏమాత్రం తగ్గించకుండా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. నాని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ! తెలంగాణ యాస కోసం గట్టిగానే శ్రమించాడు. ఇక కీర్తి సురేష్ కూడా అచ్చమైన సంప్రదాయమైన పిల్ల అనుకుంటారు కానీ అందుకు భిన్నంగా ఊర మాస్ అనిపించేలా అద్భుతమైన నటన ప్రదర్శించింది. దీక్షిత్ శెట్టి కూడా తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు.

    సాంకేతిక వర్గం :

    విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 90 నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. సంతోష్ నారాయణ్ అందించిన పాటలు నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది. బ్యాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయి. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విషయానికి వస్తే …… తెలుగునాట మరో స్టార్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొదటి చిత్రంతోనే తనదైన మార్క్ వేసాడు.

    ఓవరాల్ గా :

    నాని , కీర్తి సురేష్ ల కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా …… దసరా.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nani Remuneration : నాని ఒక్క సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నాడో తెలుసా..?

    Nani Remuneration : న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారు లేరు.....

    Natural star Nani : కన్ఫ్యూజన్ లో న్యాచురల్ స్టార్.. తమిళ డైరెక్టర్ తోనా? తెలుగు డైరెక్టర్ తోనా?

    Natural star Nani : ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్...

    Nani : ‘హాయ్ నాన్న” మూవీలో నాని కూతురుగా చేసిన పాప  తెలుసా.. బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు..  

    Nani న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.....

    natural star Nani: #Nani30 గురించి అదిరిపోయే అప్‌డేట్

    natural star Nani న్యాచురల్ స్టార్ నాని నుంచి మరో అధిరిపోయే...